ఈ మధ్యకాలంలో ఎలాంటి ప్రోగ్రామ్ లోనైన సరే కచ్చితంగా కూటమి నేతలు పోటీపడి మరి పాల్గొంటూ ఉన్నారు. అలా ఇటీవలే కాకినాడలో కూడా చైర్మన్ ప్రమాణ స్వీకారానికి చాలామంది నేతలు హాజరయ్యారు. దీంతో అక్కడ ఒక్కసారిగా అపశృతి చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.. ముఖ్యంగా కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ తుమ్మల రామస్వామి ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరుగుతూ ఉండగా ఒకసారిగా వేదిక కుప్పకూలిపోయిందట. ఈ ఘటనలో మాజీ మంత్రి చినరాజప్పకు కూడా స్వల్ప గాయాలు అయినట్లుగా సమాచారం.


వీరితో పాటు స్టేజ్ కూలిన సమయంలో మాజీమంత్రి యనమల రామకృష్ణుడు, పంతం నానాజీ తో పాటు పలువురు నేతలు కూడా ఈ వేదిక పైన ఉన్నట్లు సమాచారం ఇందులో చినరాజప్పకు సాయంత్రం స్వల్ప గాయాలు అయ్యాయని యనమల రామకృష్ణుడుకు పంతం నానాజీ సైతం ఈ ప్రమాదం నుంచి బయటపడడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం విన్న పలువురు అభిమానులు కూడా ఆందోళన పడ్డ ఆ తర్వాత అసలు విషయం తెలిసి కాస్త ఊపిరి పీల్చుకున్నారు.


అయితే ఈ ప్రమాణ స్వీకారోత్సవం కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ వేదిక పైకి పరిమితికి మించి మరి నాయకులు ఎక్కి ఆ స్టేజ్ మీద కూర్చోవడం వల్ల ఈ ఘటన జరిగిందన్నట్లుగా అక్కడ కొంతమంది ప్రత్యక్ష సాక్షులు తెలియజేస్తున్నారు.. అయితే ఈ ప్రమాణ స్వీకారం చేయకముందే ఇలాంటి అపశృతి జరగడంతో  రామస్వామి ప్రమాణ స్వీకారం మరొక తేదీకి పోస్ట్ పోన్ చేసుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు సంబంధించి ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది.అయితే ఇలాంటివి ఇప్పుడే కాకుండా గతంలో కూడా జనసేన నేతలు టిడిపి నేతలు ఇతరత్రా షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ చేయడానికి కూడా కొట్టుకున్న సందర్భాలు ఉన్నాయి.. కానీ ఇక్కడ మాత్రం స్టేజ్ కు మించి కూర్చోవడం వల్ల ఆ స్టేజ్ కుప్పకూలినట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: