ఉత్తరాంధ్ర వైసీపీ ఇప్పుడు పూర్తిగా పెద్ద మనుషుల చేతుల్లో కి వచ్చింది. ఒకరు స్థానికంగా బాగా పట్టున్న వారు .. సామాజిక వర్గపరంగా బలమైన నేతగా ఉన్నారు. దశాబ్దల రాజకీయ అనుభవం ఉంది. రెండవ నేత జాతీయ స్థాయిలో పట్టున్న నేత .ఇప్పుడు ఇద్దరు నాయకుల వ్యూహాలు వైసీపీకి కావాలనే అధినాయకత్వం నిర్ణయించింది. తాజాగా ఉత్తరాంధ్ర జిల్లాల వైసిపి ఇన్చార్జిగా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి నియమితులైన సంగతి తెలిసిందే. ఆయనను ఏరి కోరి మరియు పార్టీ హై కమాండ్ నియమించింది. ఆయన మళ్లీ నియమించడం పట్ల స్థానికంగా కొందరు నేతలలో అసంతృప్తి ఉందన్న ప్రచారం జరిగింది. ఆయన ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ చార్జ్ గా నియమితులు అయిన తర్వాత మొదటిసారి విశాఖ వచ్చినప్పుడు మాజీ మంత్రి విశాఖ జిల్లా ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆయనను కలవలేదు. విశాఖలో పార్టీ ఆఫీసు ప్రారంభం వేళ విజయసాయిరెడ్డి - బొత్స ఇద్దరు కలుసుకున్నారు.
ఈ ఇద్దరు మధ్య సానిహిత్యం ఎలా ఉంటుందో ? అని అందరి నేతలు ఆసక్తిగా ఎదురు చూశారు. అయితే పార్టీ ఆఫీస్ ప్రారంభోత్సవంలో ఇద్దరు కలిసి కరచాలనం చేసుకుంటూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ సందర్భంగా ఇద్దరి నేతలు పార్టీ నేతలను ఉద్దేశించి మాట్లాడుతూ వైసీపీని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని ఒకే మాటగా చెప్పారు. గతంలో ఇద్దరు మధ్య కొంత గ్యాప్ అయితే నడిచింది. అసలు విజయ్ సాయి రెడ్డికి విశాఖలో ఏం పని ? అన్నట్టుగా బొత్స ఉండేవారు. ఇప్పుడు ఇద్దరూ కలిసిపోవడంతో పాటు ఇద్దరికీ పెద్దల సభలో పదవులు ఉండటంతో ఉత్తరాంధ్రలో పార్టీని బలోపేతం చేయాల్సిన అంశంపై దృష్టి పెట్టనున్నారు. మరి ఈ ఇద్దరి కలయి కతో ఉత్తరాంధ్ర వైసీపీ లో కొత్త జవసత్వాలు వస్తాయేమో ? చూడాలి.