- ( ఉత్తరాంధ్ర - ఇండియా హెరాల్డ్ ) . .
ఎన్నికలలో ఘోర పరాజయం తర్వాత వైసిపి నుంచి పలువురు కీలక నేతలు .. వరుస పెట్టి బయటకు వచ్చేస్తున్నారు. మాజీ మంత్రులు .. మాజీ ఎంపీలు .. మాజీ ఎమ్మెల్యేలు .. మాజీ ఎమ్మెల్సీలు ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు రాజ్యసభ సభ్యులుగా ఉన్నవారు సైతం తమ పదవులు వదులుకొని మరి పార్టీ నుంచి బయటికి వస్తున్న పరిస్థితి. ఈ క్రమంలోనే మాజీ మంత్రి భీమిలి కి చెందిన సీనియర్ నేత అవంతి శ్రీనివాస్ వైసీపీకి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. అవంతి శ్రీనివాస్ వైసీపీని వెళ్లడంతో అక్కడ వైసిపికి దిక్కు ముక్కు లేకుండా పోయింది. అయితే విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ మాత్రం అవంతి శ్రీనివాస్ పార్టీని వీడి వెళ్లిపోవడంతో భీమిలి వైసీపీకి స్వాతంత్య్రం వచ్చిందని చెబుతున్నారు. ఆయన వెళ్లిపోవటం వల్ల భీమిలి వైసిపి నేతలు .. కార్యకర్తలు చాలా సంతోషంగా ఉన్నారని చెబుతున్నారు. పేరుకు గుడివాడ అమర్నాథ్ అలా చెప్తున్నా అవంతి లాంటి బలమైన నేత ఇప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి పార్టీని వీడడం పెద్ద ఎదురుదెబ్బే అని చెప్పాలి.
అయితే భీమిలి కి ఇప్పుడు వలస నాయకులు వద్దని స్థానికంగా బలంగా ఉన్నన్ని అతనికి ఇంచార్జ్ బాధ్యతలు ఇవ్వాలని లోకల్ లీడర్లకే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు. తాము కష్టపడి పని చేస్తామని గుర్తించాల్సింది పార్టీ పెద్దలు అని వారు అభిప్రాయపడుతున్నారు. ఇక ప్రస్తుతం భీమీలి ఎమ్మెల్యే గా మాజీ మంత్రి .. టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు ఉన్నారు. మొన్న ఎన్నికల్లో గంటా అవంతి పై ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. మరి భీమిలి వైసీపీ కి కొత్త ఇన్చార్జ్ గా ఎవరు ? వస్తారో ? చూడాలి.