ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు తనతో పాటు మరొక రెండు పార్టీలను కలుపుకొని ఈసారి ఎన్నికలలో కూటమి పేరుతో ఏపీలో ప్రభుత్వాన్ని అయితే ఏర్పాటు చేసుకున్నారు. ఈ ప్రభుత్వం అధికారం చేపట్టి ఇప్పటికి ఆరు నెలలు పూర్తి అయిన ఈ ఆరు నెలల పాలన మీద టిడిపి అనుకూల మీడియాలలో ఒకటైన ఒక మీడియా చెప్పిన విషయాలు టిడిపి పార్టీకి షాకిచ్చేలా ఉన్నాయి. చంద్రబాబు ఏమి మారలేదని పాత చంద్రబాబు అంటూ అనుకూల మీడియా డైరెక్ట్ గానే చెప్పేస్తోందట.


చంద్రబాబు పాలన అంటే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అని అధికారులను గంటలకు మీటింగులు పెట్టడమే తప్ప చేసేదేమీ లేదంటూ తెలుపుతున్నారు. క్షణం తీరిక లేదు కానీ దమ్మిడి ఆదాయం లేదు అన్నట్లుగా తెలుపుతున్నారు. గత ఆరు నెలల పాలన ఇలానే సాగిపోయింది అంటు రిలీజ్ చేశారు. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న నరేంద్ర మోడీ బయట చాలా ప్రశాంతంగా ఉంటారని కానీ ఆయన ఎప్పుడు ఏం చేయాలో అదే చేస్తారంటూ తెలిపారు. కేవలం చంద్రబాబు కాలయాతను తప్ప దానివల్ల ఒరిగేదేమీ లేదంటూ వెల్లడించారు.



ఇక విజన్ డాక్యుమెంట్ 2047 అంటూ బాబు ఎంత గొప్పగా విడుదల చేసిన వాటిని అనుకూల మీడియా కూడా తప్పుపడుతోంది.. రేపటి రోజున భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మాత్రమే పనిచేయాలని ఇలా అనవసరంగా కూడా చేయకూడదని తెలియజేసింది. వైసిపి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చాలానే అరాచకాలు జరిగాయని ఇప్పుడు మళ్లీ వారిని టిడిపి పార్టీలోకి తీసుకోవడం మళ్ళీ వారు అదే తీరుతో కొనసాగించడంలో తేడా ఏముంది అంటూ చంద్రబాబు అనుకూల మీడియా ప్రశ్నిస్తోంది. మొత్తానికి ఆరు నెలల పాలనలో చంద్రబాబు పైన సపోర్టు చేసే మీడియా నెగిటివ్ ధోరణిలోనే తెలియజేసింది.. కలెక్టర్ల సమావేశంలో ఎవరు హామీలను సైతం గుర్తు చేయలేదా ఒకవేళ ఇదే తీరు ఇలాగే వెళితే కచ్చితంగా మళ్ళీ జగన్ అధికారంలోకి వస్తారని ఈ పాపం మొత్తం చంద్రబాబుదే బాధ్యత అంటూ అనుకూల మీడియా తెలియజేసింది.. గ్రౌండ్ లెవెల్ కూడా వేరేగా ఉందని తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: