తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆయన తిన్న భోజనం పైన ఇప్పుడు దారుణంగా ట్రోలింగ్ జరుగుతోంది. తాజాగా వేములవాడ పర్యటనకు.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్లిన సంగతి తెలిసిందే. గత నెల చివర్లో... వేములవాడ పర్యటనకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్లారు. ఈ సందర్భంగా... వేములవాడ నియోజకవర్గంలో, రాజన్న ఆలయ పరిధిలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

ఇక ఈ పర్యటనలో రేవంత్ రెడ్డి తో పాటు... కాంగ్రెస్ నేతలు, మంత్రులు, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ లాంటి కీలక నేతలు కూడా వెళ్లారు.ఈ సందర్భంగా వేములవాడ రాజన్న పుణ్యక్షేత్రంలో...ప్రత్యేక పూజలు చేశారు. అభిషేకాలు కూడా నిర్వహించారు. అయితే ఈ పర్యటనలో... దాదాపు కోటి 73 లక్షలు ఖర్చయిందట. ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం... చేసిన భోజనం ఖర్చు 32 లక్షలు దాటిందట.

దాదాపు 100 మందికి పైగా... రేవంత్ రెడ్డి తినే భోజనాన్ని తిన్నారట. అది కూడా... హైదరాబాదులోని తాజ్ కృష్ణ నుంచి  ప్రత్యేకంగా వేములవాడ రాజన్న సన్నిధికి తెప్పించుకున్నారట. ఒక ప్లేట్ భోజనం ధర... 32 వేల రూపాయల అట. ఈ లెక్కన 100 మంది భోజనం చేస్తే... 32 లక్షలు దాటిందట. ఈ విషయాన్ని గులాబీ సోషల్ మీడియా తెగ ప్రచారం చేస్తోంది. ఇక దీనికి సంబంధించిన బిల్లులు చెల్లించాలని... వేములవాడ రాజన్న సన్నిధి ఆలయ అధికారులకు... తాజ్ కృష్ణ హోటల్ యాజమాన్యం బిల్లులు పంపిందట.

అయితే... తెలంగాణ రాష్ట్ర ఉన్నత అధికారులు మాత్రం చేతులెత్తేసారట. ఈ బిల్లులు మొత్తం వేములవాడ ఆలయానికి సంబంధించిన అధికారులు...చెల్లించాలని... ఉన్నతాధికారులు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారట. దీంతో అంత డబ్బు ఎక్కడి నుంచి కట్టాలని వేములవాడ రాజన్న ఉన్నతాధికారులు...ఆందోళన వ్యక్తం చేస్తున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: