కూట‌మి ప్ర‌భుత్వంలో మంత్రులుగా చాలా మంది ఉన్నారు. అయితే... ఎవ‌రి దారి వారిదే. కానీ, త‌న‌దైన దారిలోనే ప్ర‌యాణిస్తున్న‌ప్ప‌టికీ.. ప్ర‌జ‌ల క‌ష్టాలు తెలిసిన నాయ‌కుడిగా.. మంత్రిగా గొట్టిపాటి ర‌వికుమార్ .. దూకుడుగా ముందుకు సాగుతున్నారు. ప్ర‌స్తుతం కూట‌మి స‌ర్కారులో విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్న గొట్టిపాటి.. ఈ శాఖ‌ను స‌మ‌ర్థ‌వంతంగా నిర్వ‌హిస్తున్నారన‌డంలో సందేహం లేదు. ఎందుకంటే.. ప్ర‌జ‌ల‌కు అత్యంత కీల‌క‌మైన శాఖ‌ల్లో విద్యుత్ శాఖ ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉంది.


అయితే.. క‌ష్టాలు.. నష్టాలు.. విమ‌ర్శ‌లు.. కూడా ఈ శాఖ‌కే ఎక్కువ‌గా ఉన్నాయి. విద్యుత్ కోత‌లు.. బిల్లుల చార్జీలు.. అదేవిధంగా ఇత‌ర క‌ష్టాలు వెర‌సి.. విద్యుత్ శాఖ‌లో నాలుగు చేతుల నిండా ప‌నిచేసినా.. త‌ర‌గ నంత ప‌ని ఉంటుంది. అందుకే.. సాధార‌ణంగా విద్యుత్ శాఖ‌ను తీసుకునేందుకు ఎవ‌రూ ఇష్ట‌ప‌డ‌రు. అయితే.. గొట్టిపాటికి ఆది నుంచి కూడా స‌వాళ్ల‌తో సావాసం చేయ‌డం అల‌వాటుగా మారిపోయింది. రాజ‌కీయాల్లో ఆయ‌న అనునిత్యం స‌వాళ్ల‌నే ఎదుర్కొన్నారు.


సో.. దీంతో ఆయ‌న విద్యుత్ శాఖ‌ను అమిత ఇష్టంగా తీసుకున్నారు. సీఎం చంద్ర‌బాబును మెప్పించారు. నిజానికి సీఎం చంద్ర‌బాబును మెప్పించ‌డం అంటే.. అంత ఈజీకాదు. ఎంతో క‌ష్ట‌ప‌డితే త‌ప్ప‌.. ఆయ‌న `స‌ర్లే.. బాగానే ప‌నిచేస్తున్నావు` అని అన‌రు. అలాంటి చంద్ర‌బాబు ద‌గ్గ‌ర గొట్టిపాటి మంచి మార్కులు కొట్టేశారంటే.. ఎంత‌గా మ‌న‌సు పెట్టి శాఖ‌ను నిర్వ‌హిస్తున్నారో అర్ధ‌మ‌వుతుంది. అస‌లు ఇప్పుడున్న చ‌ర్చ‌ల్లా.. విద్యుత్ బిల్లులే. దాదాపు 14 వేల కోట్లు ఒక‌సారి, 9 వేల కోట్లు మ‌రోసారి ప్ర‌జ‌ల‌పై భారాలు మోప‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి ఎదురైంది.


వైసీపీ హ‌యాంలో అదానీతో చేసుకున్న ఒప్పందం మేర‌కు ఈ భారాలు ప‌డ్డాయ‌న్న‌ది వాస్త‌వం. కానీ, దీనిని ప్ర‌జ‌ల‌కు ఎలా వివ‌రించాల‌నే విష‌యంలో అనేక సందేహాలు వ‌చ్చాయి. ఈ క్ర‌మంలో అనేక ద‌ఫాలుగా మీడియా ముందుకు వ‌చ్చిన ర‌వి.. త‌న‌దైన శైలిలో ప్ర‌జ‌ల‌కు న‌చ్చ‌జెప్పారు. అదే స‌మ‌యంలో ఎవ‌రికీ భారం కాని రీతిలోనే ఈ బిల్లులు ఉంటాయ‌ని కూడా వివ‌రించి స‌క్సెస్ అయ్యారు. ఫ‌లితంగా చార్జీలు పెరిగినా.. ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త రాకుండా జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు.


అనేక సంస్క‌ర‌ణ‌లు..

+ గొట్టిపాటి ర‌వి మంత్రిగా విద్యుత్ శాఖ‌లో అనేక సంస్క‌ర‌ణ‌లు తీసుకువ‌చ్చారు. చిన్న పాటి స‌మ‌స్య‌ల‌కు త‌క్ష‌ణ ప‌రిష్కారం చూపించారు. జ‌గ‌న్ సొంత నియోజ‌క‌వ‌ర్గం పులివెందుల‌లో రైతుల పొలాల‌పై నుంచి హైటెన్ష‌న్ వైర్లు వెళ్తున్నాయ‌ని ఎప్ప‌టి నుంచో ఫిర్యాదులు వున్నాయి. ఈ విష‌యం త‌న దృష్టికి రాగానే గొట్టిపాటి చ‌లించి పోయారు. అప్ప‌టిక‌ప్పుడు ఆ లైన్ల‌ను మార్పించారు.

+ విద్యుత్ చార్జీలను కొంద‌రు ఆల‌స్యంగా క‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో క‌రెంటు స‌ర్వీసుల‌ను నిలిపివేసే ప‌ద్ధ‌తి ఉండేది. కానీ, దీనినీ తీసేసి.. మ‌రింత స‌మ‌యం పొడిగించారు.

+ ఎక్క‌డైనా ప్ర‌మాద‌వ శాత్తు వైర్లు తెగిప‌డి.. ఎవ‌రైన చ‌నిపోతే.. వారికి త‌క్ష‌ణ సాయం అందించేలా చ‌ర్య‌లు తీసుకున్నారు. అప్ప‌టిక‌ప్పుడు రూ. 10 వేల చొప్పున మ‌ట్టిఖ‌ర్చులు అందించేలా విద్యుత్ శాఖ‌ను మ‌లిచారు. త‌ర్వాత ప‌రిహారం అందించే విష‌యంలోనూ అధికారుల జాప్యాన్ని త‌గ్గించారు.


+ విద్యుత్ బిల్లులు స‌కాలంలో ఇవ్వ‌డంతోపాటు.. బిల్లులు తీసే యంత్రాంగానికి ఇచ్చే క‌మీష‌న్ల‌ను కూడా పెంచారు. వారిలో మ‌రింత ఉత్సాహం నింపారు.

+ అన‌ధికార స‌ర్వీసుల‌ను రెగ్యుల‌రైజ్ చేయడం ద్వారా.. ప్ర‌జ‌ల క‌ష్టాలు తీర్చారు. ఇలా.. త‌న‌దైన శైలిలో గొట్టిపాటి ర‌వి.. త‌న శాఖ‌ను ప‌రుగులు పెట్టిస్తున్నార‌న‌డంలో సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: