దివంగత బీసీ నేత సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో టిడిపి నేతలతో కలిసి వైసిపి నాయకుడు .. మాజీమంత్రి జోగి రమేష్ పాల్గొనడంపై టిడిపి వర్గాల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మంత్రి కొలుసు పార్థసారథి తో పాటు గౌతు లచ్చన్న మనవరాలు పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ఇతర టిడిపి నేతలు పాల్గొన్నారు. వీళ్లంతా నూజివీడు పట్టణమంతా ఓపెన్ టాప్ జీప్ పై భారీ ర్యాలీ కూడా చేశారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. జైలుకు వెళ్లాల్సిన మాజీ మంత్రి జోగి రమేష్ ను టిడిపి నేతలు కాపాడుతున్నారని టిడిపిలోనే పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ఈ విషయం సోషల్ మీడియా లో అటు ఇటు తిరిగే మంత్రి నారా లోకేష్ దృష్టికి వెళ్లడంతో ఆయన పార్టీ నేతల నుంచి వివరణ కోరినట్లు తెలుస్తోంది. దీనిపై మంత్రి కొలుసు పార్థసారధి తో పాటు పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషను వివరణ ఇవ్వాలని నారా లోకేష్ ఆదేశించినట్టు సమాచారం.
అయితే దీనిపై టిడిపి నేతలు మాట్లాడుతూ ఇది పార్టీ పరమైన కార్యక్రమం కాదని ... సామాజిక వర్గ పరంగా ఏర్పాటు చేసిన కార్యక్రమం అని సర్ది చెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు . .. గౌడ సంఘం వాళ్ళు ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తే .. అన్ని పార్టీల నేతలు హాజరయ్యారని .. అంతేతప్ప ఉద్దేశపూర్వకంగా ఈ కార్యక్రమానికి జోగి రమేష్ ను పిలవలేదని అంటున్నారు. ఇదే విషయాన్ని వారు నారా లోకేష్ దృష్టికి కూడా తీసుకువెళ్లను న్నారు.
ఇక సోషల్ మీడియా లో అయితే గతంలో జోగి రమేష్ టీడీపీపై, చంద్రబాబుబై చేసిన వ్యాఖ్యల వీడియో లను కొందరు టీడీపీ నేతలే వైరల్ చేస్తున్నారు. ఇక లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమానికి జోగి ని ఆహ్వానించి .. టీడీపీ నేతలు కార్యకర్తల మనోభావాలను దెబ్బ తీస్తున్నారని అంటున్నారు. వైసీపీ హయాంలో ప్రత్యర్థి పార్టీల నేతలంటే వ్యక్తిగత శత్రువులే అన్నట్లుగా రాజకీయాలు మారిపోయాయి. ఇప్పుడు టీడీపీ కూడా అలాంటి రివేంజ్ కోరుకుంటుంటే .. వాళ్లు వైసీపీ వాళ్లతో చెట్టా పట్టా లేసుకుని తిరుగుతూ ఉండడం ఎవ్వరికి నచ్చడం లేదు.