జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం టికెట్ త్యాగం చేసిన తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నేత పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మకు సొంత నియోజకవర్గ పిఠాపురంలో మరోసారి బ్రేకులు పడినట్టే కనిపిస్తోంది. ఆయన అనుచరులకు తీవ్ర పరాభవం జరిగినట్టు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. వచ్చే నెల సంక్రాంతిని పురస్కరించుకుని పిఠాపురం పరిసర ప్రాంతాల్లో కోడిపందాలు వేయటం ఆనవాయితీగా ఎప్పటినుంచో వస్తోంది. ఆ మాటకు వస్తే రెండు తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి పండుగ కు ఎక్కడ చూసినా ఈ ఆనవాయితీ నడుస్తూ ఉంటుంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా వర్మ అనుచరులు పెద్ద ఎత్తున బరులు వేసి పందాలు వేశారు. ఇప్పుడు సొంత పార్టీ టిడిపి కూటమి అధికారంలో ఉంది దీంతో మరింత పెద్ద ఎత్తున పందాలు వేయలని భావించిన వర్మ అనుచరులకు పోలీసుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతుంది.
రెండు రోజులకు ఇక్కడ వర్మ అనుచరులకు పోలీసులు ఫోన్లు చేసి మరి వారని మరీ ప్రచారం జరుగుతుంది. కోడిపందాల బరులు వేయటానికి వీలు లేదని ... ఇది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం అని ... ఇక్కడ పందాలు వేయవద్దని పైనుంచి ఆదేశాలు వచ్చాయని వారు తేల్చి చెప్తున్నారు. అంతే కాదు ఎవరైనా సాహసించి బరులు వేస్తే అరెస్టులు తప్పవని కూడా పోలీసులు హెచ్చరిస్తున్నారు. దీంతో వర్మ అనుచరులు ఇప్పుడు వర్మ ఇంటికి క్యూ కడుతున్నారట. ఆయన మాత్రం మౌనంగా ఉంటున్నారు. ప్రస్తుతం హైదరాబాదు లో ఉంటున్న వర్మ తాను త్వరలో పిఠాపురం వస్తానని మీరు అధైర్య పడవద్దని తన అనుచరులకు చెప్పినట్లు తెలుస్తోంది.
మరోవైపు జనసేన నాయకులు కూడా బరులు గీస్తే చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎస్పీకి ఫిర్యాదులు పెడుతున్నాయి. ఈ పరిణామాలతో వర్మ వర్గం డైలమా లో పడింది. రాజకీయంగా కూడా వర్మకి ఇది సవాలుగా మారినట్టు కనపడుతోంది. ఇప్పటికే ఎమ్మెల్సీ వస్తుందని ఆశలు పెట్టుకున్న వర్మకు ఎమ్మెల్సీ పదవి రాలేదు. దీంతో ఇప్పుడు నియోజకవర్గంలో తన అనుచరుల కు చిన్న చిన్న పనులు కూడా చేసి పెట్టలేని పరిస్థితిలో ఉన్నానని వర్మ ఆవేదనతో ఉన్నట్టు సమాచారం.