2024 ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీల ప్రభావమో లేకపోతే పవన్ కళ్యాణ్ తోడయ్యారో తెలియదు కానీ వరుసగా బిజెపి, జనసేన, టిడిపి పార్టీలు కూటమికట్టి ఎలాగోలాగా గెలిచేశారు.. అయితే గెలిచినప్పటి నుంచి కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను సైతం అమలు చేయాలి అంటూ వైసీపీ నేతలతో పాటు ప్రజలు కూడా కూటమి ప్రభుత్వం పైన ఒత్తిడి చేస్తున్నారు.. ముఖ్యంగా గెలవడం కోసం ఎన్నో హామీలను సైతం చెప్పారు.. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయాలంటే భయమేస్తుంది అన్నట్లుగా తెలిపారు.



వాలంటరీలకు 5000 నుంచి 10000 పెంచుతామంటూ చంద్రబాబు హామీ ఇచ్చిన అసలు వాలంటరీలతో సంబంధం లేదన్నట్లుగా పవన్ కళ్యాణ్ మాట్లాడారు.. ఇదే సమయంలో గ్రామ, వార్డు సచివాలయంలో కూడా వాలెంటరిలకు సంబంధించిన అంశాలను కూడా తీసేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఒక్కసారిగా వాలంటీర్లు కూడా దీక్ష మొదలు పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. విజయవాడలోని గాంధీనగర్ వద్ద వాలంటీర్లు ఆందోళనకు దిగారు. వీరికి సపోర్టుగా ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ మద్దతు కూడా లభించిందట. గత ఆరు నెలల నుంచి పోరాటం చేస్తున్న ప్రభుత్వం స్పందించలేదట.


ఇక తమకు న్యాయం చేయాలి అంటూ VAO లు కూడా విజయవాడలో ధర్నాకు దిగారట. వీరికి మద్దతుగా పలు రకాల కార్మిక సంఘాలకు కూడా నిలిచినట్లు సమాచారం. ఈ సందర్భంగా గత ఐదు నెలలుగా వేతనాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నామని హెచ్చరిస్తున్నారు. ఇందులో సుమారుగా 15 వేల మందికి నెలకు 8000 జీతాన్ని ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఈ విధంగా ప్రభుత్వం పైన ఫైర్ అవుతున్నారు.. ఇప్పుడు అటు వాలంటరీ దీక్షలు , విఏవోల దీక్షలతో పాటు, రాబోయే రోజుల్లో ఉద్యోగులు కూడా పిఆర్సిలు పెంచకపోయినా నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించకపోయిన ధర్నాలు రాబోతున్నాయి అనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే సూపర్ సిక్స్ హామీలను కూడా అమలు చేయకపోతే కూటమి ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవు.. ఇటీవలే విద్యుత్ చార్జీలను పెంపు, ఇసుక విధానం, మద్యం  విధానం పైన కూడా వైసీపీ పార్టీ ధర్నాలు కలెక్టర్ల ముందర చేశారు. మరి అసలైన సమస్య చంద్రబాబుకు ఇప్పుడే మొదలవుతోంది మరి ఎలా దాటుకుంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: