కొంతమంది ఇందులో టిడిపి పార్టీలోకి చేరుతూ ఉండగా మరి కొంతమంది జనసేనలోకి చేరుతూ ఉన్నారు. అయితే ఇప్పుడు తాజాగా వైసీపీ నేత జోగి రమేష్ కూడా వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారని ప్రచారం జరిగింది. వైసిపి అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు ఇంటి పైన దాడి జరిగిన ఘటనలో ఈయన పైన కేసు నమోదు అవ్వడం జరిగింది.. పోలీసులు విచారణకు కూడా హాజరయ్యారు ఈయన కుమారుడు పైన కూడా అగ్రిగోల్డ్ భూముల విషయంలో పలు రకాల కేసులు నమోదయ్యాయి. దీంతో గత కొంతకాలంగా పార్టీలో కనిపించకపోవడంతో ఈయన పార్టీ మారే ఆలోచనలు ఉన్నట్లు ప్రచారం అయితే కొనసాగింది.
అంతేకాకుండా తాజాగా టిడిపి నేతలతో జోగి రమేష్ కనిపించడంతో ఈ విషయం మరింత జోరు పెంచింది.. అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం లచ్చన్న విగ్రహావిష్కరణలకు రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదని జోగి రమేష్ మద్దతుదారులు వెల్లడిస్తున్నారు.. మాజీ మంత్రి పేర్ని నాని పైన అక్రమ కేసులు బనాయించడంతో ఆయన ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని ఇటీవలే వైసిపి నేతలు కూడా ఆరోపించారు ఈ క్రమంలో పేర్ని నాని ఇంటికి వెళ్లి మరి ఆయనకు జోగి రమేష్ సానుభూతి తెలియజేశారట. దీంతో ఆయన వైసీపీలో ఉంటాను అంటూ స్పష్టం చేసినట్లు సమాచారం.