కేంద్ర ప్రభుత్వం వన్ నేషన్.. వన్ ఎలక్షన్ బిల్లును సైతం ఇటీవలే లోక్సభలో కూడా ప్రవేశపెట్టారు. అయితే బిజెపి తమ ఎంపీలకు ఇప్పటికే త్రీ లైన్ జారీ చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై కాంగ్రెస్ కూడా తమ ఎంపీలకు విప్  జారీ చేసినట్లు సమాచారం. దీంతో ఎంపీలు అందరూ కూడా సభకు హాజరు కావాలని కోరడం జరిగిందట.. ముఖ్యంగా ఎంపీలందరూ కూడా సభకు హాజరైన తర్వాత జమిలి ఎన్నికల బిల్లు పైన చర్చించేలా చూడమని అటు బిజెపి ,కాంగ్రెస్ నేతలతో పాటు ఇతర నేతలు కూడా తెలియజేశారట.


జమిలి ఎన్నికలకు సంబంధించి ఈ బిల్లును సైతం కేంద్ర న్యాయశాఖ మంత్రి అయినటువంటి ram MEGHWAL' target='_blank' title='అర్జున్ రామ్ మేఘవాల్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>అర్జున్ రామ్ మేఘవాల్ లోక్సభలో ప్రవేశపెట్టడం జరిగింది. ఆ తర్వాత విస్తృత సంప్రదింపులకు వీలుగా బిల్లును సైతం జాయింట్ పార్లమెంటు కమిటీని పరిశీలించాలి అంటూ.. కేంద్రమంత్రి స్పీకర్ హోమ్ బిర్లాను కోరి అవకాశం కూడా ఉంటుందట.. అయితే ఇందులో లోక్సభ స్పీకర్ హోమ్ బిర్లా జాయింట్ పార్లమెంటరీ కమిటీ చైర్మన్ లను సైతం నియమించేందుకు అవకాశం ఉన్నదట.


ముఖ్యంగా సంఖ్యాబలం ఆధారంగా పార్టీలకు ఇందులో స్థానం కల్పించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే మెజారిటీ ఉన్న బిజెపి ఎంపీలలో ఒకరిని చైర్మన్గా ఎంపిక చేసేందుకు సైతం ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయట. భాగస్వామ్య పక్షాలందరితో కూడా చర్చించడానికి సుమారుగా 90 రోజులపాటు కమిటీ ఇవ్వాల్సి ఉన్నదట. ఒకవేళ అవసరం అయితే ఈ గడువును కూడా పొడిగించుకోవచ్చని తెలియజేస్తున్నారు.. డిసెంబర్ 20న పార్లమెంటు శీతాకాల సమావేశాలు ముగియబోతున్నాయి అందుకే పార్లమెంటులో జమిలి ఎన్నికల బిల్లును సైతం ఈరోజు ప్రవేశపెట్టినట్లు తెలుస్తోంది.. అయితే జమిలి ఎన్నికలకు 32 పార్టీలు మద్దతు ఇస్తున్నట్లుగా తెలుస్తోంది.మరొక 15 పార్టీలు మాత్రమే వ్యతిరేకిస్తున్నట్లు మాజీ రాష్ట్ర రామ్ నాథ్ గోవింథ్ కమిటీ తెలియజేసింది. మరి దీన్ని బట్టి చూస్తే జమిలి ఎన్నికల పై ఫుల్ క్లారిటీ ఈరోజు వస్తుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: