ఆంధ్రప్రదేశ్లో మద్యం వ్యాపారం ఇప్పుడు ఎక్కువగా కొనసాగుతోంది. ఈ ఏడాది అక్టోబర్ 16వ తేదీన రాష్ట్రంలో కొత్త మద్యపాలసి తీసుకువచ్చింది కూటమి ప్రభుత్వం. ఇప్పుడు తాజాగా మద్యం అమ్మకాల పైన చాలామంది వ్యాపారస్తులు కూడా నిరసనలను తెలిపారు.. ఇప్పుడు  టిడిపి పార్టీకి చెందిన తిరుపూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తీవ్ర అసహనాన్ని సైతం తెలియజేశారు. ముఖ్యంగా కూటమి గౌర్నమెంట్లో ఇష్టానుసారంగా పుట్టుకొచ్చిన బెల్టు షాపులను తొలగించాలి అంటూ ఆయన డిమాండ్ చేయడం జరిగింది. తిరుపూర్ టౌన్ లో కేవలం 4 వైన్ షాపులు ఉంటే బెల్ట్ షాపులు సుమారుగా 40 వచ్చాయని ఫైర్ అవుతున్నారు.



నియోజవర్గం పరిధిలో మండలాలలో సుమారుగా 135 బెల్ట్ షాపులు పుట్టుకొచ్చాయని వెల్లడించారు. ఈ మద్యం దుకాణాల లైసెన్సులను సైతం రద్దు చేయాలంటూ ఆయన ఎక్స్చేంజ్ అధికారులను డిమాండ్ చేస్తున్నారు. తమ నియోజకవర్గంలో 48 గంటలలో ఈ బెల్ట్ షాపులు కూడా సీజ్ చేయకపోతే తానే ప్రత్యక్షంగా రంగంలోకి దిగుతానని వాటిని సీజ్ చేస్తానంటూ ఎక్స్చేంజ్ అధికారులకు ఒక డేట్ లైన్ సైతం విధిస్తూ ఒక వీడియోని సోషల్ మీడియాలో రిలీజ్ చేసినట్లు తెలుస్తోంది.


ఉమ్మడి కృష్ణాజిల్లాలోని 236 మద్యం షాపులకు అనుమతి ఇచ్చిన టిడిపి పార్టీ కృష్ణాజిల్లాలో 123, ఎన్టీఆర్ జిల్లాలో 113 వైన్ షాపులు ఉన్నాయి.. మరి టిడిపి ఎమ్మెల్యే ఇచ్చినటువంటి ఈ స్టేట్మెంట్ కి ఎక్సేంజ్ అధికారులు ఏ విధంగా స్పందించి బెల్ట్ షాపులను సీజ్ చేస్తారో లేదా చూడాలి మరి.. అయితే ఎమ్మెల్యే కూలికపూడి శ్రీనివాసరావు గతంలో కూడా రోడ్లు సరిగ్గా లేవనే విధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా నిరసనలను తెలియజేశారు.. ఇలా అధికార పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఎన్నోసార్లు నిరసనలు తెలియజేశారు ముఖ్యంగా గతంలో వైసిపి పార్టీకి చెందిన ఒక భవనాన్ని కూడా కూల్చేయడంలో నానా హంగామా సృష్టించారు ఈ ఎమ్మెల్యే. ఇప్పుడు మరొకసారి మద్యం మీద ఇలా దండ ఎత్తడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: