వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఆయన శాంతి గురించి గత కొన్ని నెలల క్రితం ఎన్నో రూమర్స్ వినిపించాయి.. అయితే వీటి పైన విజయసాయిరెడ్డి అదిరిపోయే కౌంటర్లు ఇవ్వడం జరిగింది.. దీంతో ఈ విషయం ఆగిపోయింది..అయితే ఇప్పుడు మళ్లీ తెరపైకి శాంతి భర్త మరొకసారి ఇప్పుడు నారా లోకేష్ ను కలిసి తనకు న్యాయం చేయాలి అంటూ కొన్ని విషయాలను తెలియజేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వాటి గురించి చూద్దాం.


తన భార్య శాంతిని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి లోపర్చుకొని మరి విశాఖపట్నం నుంచి 1500 కోట్ల విలువైన భూములను దోచేశారు అంటూ శాంతి భర్త ఆరోపణలు చేస్తున్నారు.. విజయ్ సాయి రెడ్డి డిఎన్ఏ పరీక్షలు నిర్వహించి వాస్తవాలు తేల్చాలి అంటూ మంత్రి నారా లోకేష్ కి శాంతి భర్త మదనమోహన్ విజ్ఞప్తి చేయడం జరిగిందట. తనకు న్యాయం చేయాలని కూడా కోరినట్లు సమాచారం. తాను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్నానని.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తన భార్యను సైతం లోబర్చుకొని విశాఖలో ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు పెద్ద ఎత్తున భూములు ఆక్రమించారంటూ ఆయన ఆరోపిస్తున్నారు..



2022-23 మధ్యలో తనను ఏ మార్చి అమెరికాకు పంపించేశారని విజయసాయిరెడ్డి తన భార్య శాంతితో రహస్యంగా సహజీవనం చేసి ఒక మగ బిడ్డకు కూడా జన్మనిచ్చారంటూ ఆయన ఆరోపిస్తున్నారు. తను స్థానికంగా లేని సమయంలో బిడ్డ ఎలా పుట్టాడని అందుకు కారణం విజయసాయిరెడ్డి అంటూ ఆయన గట్టిగా తెలియజేస్తున్నారు. అయితే ఈ విషయం పైన నారా లోకేష్ కూడా ఉన్నత అధికారులతో మాట్లాడి న్యాయం చేస్తానంటూ లోకేష్ కూడా హామీ ఇచ్చారట. అయితే ఈ విషయం పైన గడిచిన కొద్ది రోజుల క్రితం శాంతి కూడా వివరణ ఇవ్వడం జరిగింది. విజయసాయిరెడ్డి తనకు తండ్రి లాంటివారు అని చెప్పడంతో అప్పట్లో ఈ విషయాలకు కాస్త పుల్ స్టాప్ పడ్డాయి.. కానీ ఇప్పుడు మరొకసారి శాంతి భర్త ఈ విషయాన్ని వైరల్ గా చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: