ప్రస్తుతం దేశంలోని మహిళలను సైతం కేంద్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని పలు రకాల పథకాలను సైతం ప్రవేశపెడుతున్నారు.. అయితే వీటి గురించి చాలామంది ప్రజలకు కూడా తెలియకపోవడం ఉన్నది. కానీ ఈ మధ్య సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి అన్నిచోట్ల పథకాల గురించి వైరల్ గా మారుతూ ఉన్నాయి. ఇటీవల ఉజ్వల యోజన కింద ప్రతి పేద కుటుంబానికి కూడా గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడమే కాకుండా ప్రతి సిలిండర్ పైన 300 రూపాయలు సబ్సిడీ ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వం పథకాన్ని అమలు చేసింది.


అయితే ఇప్పుడు ఉచిత సోలార్ స్టవ్ పథకాన్ని కూడా ప్రారంభించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ఇప్పటివరకు ఈ పథకం కింద మహిళలకు సోలార్ కుక్కర్లను ఉచితంగా ఇస్తున్నారట.. అందుతున్న సమాచారం మేరకు రీఛార్జ్ చేయగల సోలార్ కుక్కర్లను సైతం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సంస్థలు తయారు చేస్తున్నట్లు సమాచారం.. ఇప్పటివరకు ఈ కంపెనీకి సంబంధించి సింగిల్ బర్నర్, డబుల్ బర్నర్, హైబ్రిడ్ టాప్ తో సహా పలు రకాల సోలార్ కుక్కర్ లను తయారు చేస్తున్నారట.


సోలార్ ఓవెన్ కోసం ఎవరైనా దరఖాస్తు చేసుకోవాలి అంటే అందుకు అవసరమైన పత్రాలు కూడా ఉండాల్సి ఉన్నది.. ముఖ్యంగా ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ బ్యాంకు పాస్బుక్ తో పాటు ఫోటో మొబైల్ నెంబర్ కచ్చితంగా ఉండాలట.. ఈ సోలార్ స్టవ్ కోసం దరఖాస్తు ఎలా చేసుకోవాలి అంటే..

ముందుగా ఇండియన్ ఆయిల్ అధికారిక వెబ్సైట్లోకి వెళ్లాలి..

 హోం పేజీలో వెళ్లిన తర్వాత ఇండియన్ ఆయిల్ పైన క్లిక్ చేసి.. అక్కడ సోలార్ కుకింగ్ సిస్టం ని ఎంపిక చేసుకోవాలి.


ఇండియన్ సోలార్ కుకింగ్ సిస్టం ని ఓపెన్ చేసిన తర్వాత దరఖాస్తు ఫారం నింపాలి.


ఆ తర్వాత ఫారంలో చూపించిన విధంగా మొత్తం సమాచారాన్ని జాగ్రత్తగా నింపిన తర్వాత అన్ని పత్రాలను స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. ఆ వెంటనే సబ్మిట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత ఈ ఉచిత సోలార్ పథకాన్ని ప్రారంభించుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: