ఈ సందర్భంగా మాధురి ఇంటిపై దాడి కూడా జరిగింది. అయినప్పటికీ దువ్వాడ శ్రీనివాస్ అలాగే మాధురి తగ్గడం లేదు. ఇద్దరూ సహజీవనమే చేస్తున్నారు. త్వరలోనే వీరిద్దరి ప్రేమ కథ సినిమాగా రూపొందునుందట.ఇలాంటి నేపథ్యంలో దువ్వాడ శ్రీనివాస ప్రియురాలు మాధురి గురించి సంచలన విషయం తెరపైకి వచ్చింది.
ఈ మధ్యకాలంలో గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కలవకుంట్ల తారక రామారావును... దువ్వాడ శ్రీనివాస్ ప్రియురాలు మాధురి కలిశారట. కేటీఆర్ అంటే తనకు చాలా గౌరవమని... ఆయన ప్రెస్మీట్లో కచ్చితంగా చూస్తామని తెలిపారు. అతన్ని చాలాసార్లు కూడా కలిసినట్లు వివరించింది మాధురి. టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన బెల్లంకొండ సురేష్ ద్వారా... కేటీఆర్ ను కలవడం జరిగిందని వివరించింది మాధురి.
పార్క్ హయత్ హోటల్ లో రెండు మూడుసార్లు కేటీఆర్ ను కలిసినట్లు... అది కూడా బెల్లంకొండ సురేష్ తో కలిసినట్లు వివరించింది. కల్వకుంట తారక రామారావు పెద్ద లీడర్ అని... ఆయనను దువ్వాడ శ్రీనివాస్ కూడా ఫాలో అవుతారని వెల్లడించింది. ఇక పుష్ప 2 సినిమా బ్రహ్మాండంగా ఉందని కొని ఆడింది.. అయితే అల్లు అర్జున్ ను... కక్షగట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అరెస్టు చేసిందని మండిపడింది దువ్వాడ శ్రీనివాస్ ప్రియురాలు మాధురి. అల్లు అర్జున్ కావాలనే.. కొందరు కుట్ర పన్ని అరెస్ట్ చేసినట్లు తెలిపింది మాధురి. ఈ విషయంలో బన్నీకే సపోర్ట్ అని పేర్కొంది.