- ( దక్షిణ తెలంగాణ - ఇండియా హెరాల్డ్ ) . .
తెలంగాణలో మరో కార్పొరేషన్ ఏర్పాటు కానున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా 13 కార్పొరేషన్లు ఉండగా కొత్తగూడెం మున్సిపాలిటీ - పాల్వంచ మునిసిపాలిటీలను కలిపి కొత్తగూడెం కార్పొరేషన్ గా ఏర్పాటు చేసే ప్రతిపాదనలు సర్కారు పరిశీలిస్తోంది. ప్రస్తుతం మున్సిపాలిటీగా ఉన్న కొత్తగూడెం - పాల్వంచతో పాటు సమీపంలోని నాలుగు మండలాల్లో 35 గ్రామపంచాయతీలను కార్పొరేషన్ లో విలీనం చేసే అవకాశం ఉంది. చుంచుపల్లి మండలం ... అలాగే లక్ష్మీదేవి పల్లి మండలం .. పాల్వంచ మండలం ... సుజాతనగర్ మండలంలోని కొన్ని పంచాయితీలతో పాటు మండల కేంద్రమైన సుజాతనగర్ పంచాయతీ కూడా ఈ కార్పొరేషన్ లో విలీనం కానున్నాయి.
ప్రస్తుతం కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలో 97 వేల జనాభా ఉన్నారు. పాల్వంచ పరిధిలో 90 వేల జనాభా ఉన్నారు. కొత్తగా సుజాతనగర్ మండలం నుంచి 11,000 ... చుంచుపల్లి మండలం నుంచి 41,000 ... లక్ష్మీదేవి పల్లి మండలం నుంచి 21,000 .. పాల్వంచ మండలం నుంచి ఆరువేల మంది కార్పొరేషన్ లో విలీనం కానున్నారు. మొత్తం రెండు మున్సిపాలిటీలతో పాటు విలీనం అయ్యే పంచాయతీల జనాభా కలిపితే కొత్తగూడెం కార్పొరేషన్ జనాభా 2,60,000 అవుతుంది.
ఐదు ఆరు నెలల్లో పంచాయతీల పదవీకాలం ముగిసిన వెంటనే కొత్తగూడెం కార్పొరేషన్ ఏర్పాటుకు సంబంధించిన అన్ని అంశాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. జిల్లా కేంద్రంగా ఉన్న కొత్తగూడెంను కార్పొరేషన్ గా మార్చాలని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఎప్పటికప్పుడు పలు మార్లు సీఎం రేవంత్ రెడ్డిని కలవగా.. రేవంత్ త్వరగా కొత్తగూడెం కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. ఏది ఏమైనా తెలంగాణలో ఇప్పటికే ఉన్న 13 కార్పోరేషన్లకు తోడు కొత్తగా 14వ కార్పొరేషన్ గా కొత్తగూడెం ఏర్పాటు కానుంది. దీనిపై త్వరలోనే అధికారిక ఉత్తర్వులు కూడా రానున్నాయి.