ఈ కొత్త చర్చకు కారణం ఏంటంటే శనివారంమేఘా ఇంజనీరింగ్ అధినేత మేఘా కృష్ణారెడ్డి స్వగ్రామం డోకిపర్రులో ఆయన కట్టించిన వెంకటేశ్వరస్వామి గుడిని చంద్రబాబు దర్శించుకున్నారు. గుడికి వెళ్లి దైవ దర్శనం చేసుకోవడాన్ని ఎవ్వరూ తప్పుపట్టరు. కానీ ఎవరితో వెళ్లాం.. వారు ఎవరు ? వారితో వెళితే పార్టీ కేడర్‌కు మనం ఎలాంటి సంకేతాలు పంపినట్టు అవుతుందన్న విషయాన్ని చంద్రబాబు పూర్తిగా మర్చిపోయినట్టున్నారు.
ఒక్క విషయం మాత్రం నిజం.. ఒకప్పుడు చంద్రబాబు కాంట్రవర్సీ వ్యక్తులకు బాగా దూరంగా ఉండేవారు. మొన్నటికి మొన్న కాంట్రవర్సీల్లో ఉన్న సానా సతీష్‌కు ఏకంగా రాజ్యసభ సీటు ఇచ్చారు. జగన్ టైంలో మేఘా ఇంజనీరింగ్ కంపెనీకి పోలవరం ప్రాజెక్టుతో పాటు కోట్లాది రూపాయల పంప్డ్ స్టోరేజ్ పనులు సైతం కట్టబెట్టారు. అధిక రేట్లకు ఈ ప్రాజెక్టులు కట్టబెట్టడం వల్ల ప్రభుత్వ ఖజనాపై వందల కోట్ల భారం పడుతుందన్న విమర్శలు వచ్చాయి. టీడీపీ వాళ్లే దీనిపై ఎన్నో విమర్శలు చేశారు.
అలాగే మెడికల్ కాలేజ్‌ల నిర్మాణాల కాంట్రాక్టులు కూడా మేఘాకే దక్కాయి. ఇక మేఘాపై జగన్మోహన్‌రెడ్డి ప్రతిపక్షంలో ఉండగా పట్టిసీమ ప్రాజెక్టులో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపణలు చేశారు. ఆయన అధికారంలోకి వచ్చాక అదే కంపెనీకి ఏకంగా పోలవరం ప్రాజెక్టు పనులు అప్పగించారు. ఇప్పుడు చంద్రబాబు కూడా మేఘా ..మేమూ ఒకటే... ఈ విషయంలో జగన్ అయినా.. తాను అయినా ఒక్కటే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.