- ( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ ) . .


జ‌మిలీ బిల్లుకు వైసిపి మద్దతు తెలిపింది. ఎన్డీఏ కూటమిలో ఉన్న పార్టీలతో పాటు బయట మద్దతు ఇచ్చిన పార్టీ చూస్తే ఒక వైసీపీ మాత్రమే .. ఈ క్రమంలోనే ఇండియా కూటమి కి జగన్ పెద్ద షాక్ ఇచ్చారు. పార్టీ ఓడిపోయి జగన్ ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయిన తర్వాత తన‌పై దాడులు చేస్తున్నారని జగన్ గగ్గోలు పెట్టి ఢిల్లీ వెళ్లి ధర్నా నిర్వహిస్తే ఆయనకు మద్దతు పలికింది ఇండియా కూటమి లోని పార్టీలే కావడం విశేషం .. కానీ జగన్ ఎప్పుడూ ఆ పార్టీలకు మద్దతుగా ఉండేందుకు ప్రయత్నించడం లేదు. జెమిలీ ఎన్నికల విషయంలో మద్దతుగా ఉండవద్దని ఇండియా కుటమి లోని కొన్ని పార్టీలు విజయ సాయిరెడ్డి తో ప్రత్యేకంగా మాట్లాడి జగన్ కు చెప్పించిన ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. బిజెపిని ఇప్పుడున్న పరిస్థితులలో ఎంత మాత్రం వ్యతిరేకించే పరిస్థితి లేదని వైసీపీలోని ఒక వర్గం చెప్తోంది.


పూర్తి స్థాయిలో బయటకు వచ్చి పోరాటానికి సిద్ధమైనప్పుడు మాత్రమే బిజెపికి వ్యతిరేకంగా మాట్లాడతామని అప్పటివరకు సైలెంట్ గానే ఉంటామని వైసిపి వర్గాలు చెబుతున్నాయి. ఈ లెక్కన చూస్తే వక్ఫ్‌ బిల్లుకు కూడా వైసిపి మద్దతు ప్రకటించి నా ఆశ్చర్యపోనవసరం లేదు. ఒకవేళ మద్దతు ప్రకటించకపోతే కనీసం వాక్ అవుట్ అయినా చేస్తారు .. కానీ వ్యతిరేకంగా ఓటేసే పరిస్థితి అయితే లేదు. జెమిలీ ఎన్నికలు ముందుగా వచ్చినా .. వెనుక వచ్చిన తర్వాత వచ్చిన వైసిపి ఆ బిల్లుకు తప్పక మద్దతు ఇవ్వని పరిస్థితి. ఇక విజయ సాయి రెడ్డి కూడా 2027 లోనే జెమిలీ ఎన్నికలు వస్తాయని .. తమ పార్టీ నేతలకు చెపుతున్నారట. ఆయన మాటలు ఎవరు నమ్మకపోయినా .. తాము అందుకే ఆ బిల్లుకు మద్దతు ఇస్తున్నాం అని కనీసం చెప్పుకునేందుకు అయినా ఇలాంటి ప్రచారం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: