తిరుమల శ్రీవారు కొలువై ఉన్న తిరుపతి పట్టణంలో లిక్కర్, డ్రగ్స్‌ ఉన్నాయంటూ బాంబ్‌ పేల్చారు టిటిడి మాజీ చైర్మన్, ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీ పార్టీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. తిరుపతి లో పబ్ కల్చర్ తీసుకు వచ్చారు, ఒక రెస్టారెంట్ లో మాదక ద్రవ్యాలు వాడుతున్నట్లు ఆరోపణలు వచ్చాయని ఫైర్‌ అయ్యారు. దీనిపై నిఘా లేకపోవడం,పలుకుబడి కల్గిన కూటమి నాయకులు ది కావడం వల్లే అధికారులు చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు భూమన కరుణాకరరెడ్డి.

పబ్ కల్చర్ కు ఎలాంటి అనుమతులు లేకపోయినా, ఒక రెస్టారెంట్ లో ఇలాంటివి చేయడం ఎంత దారుణం అంటూ నిలదీశారు. మనల్ని ఏమీ చేయలేరు అని బరితెగింపు ఉందంటూ చురకలు అంటించారు.  తిరుపతి నగరంలో 40 కు పైగా బ్రాంధి షాపులు విక్రయాలు చేస్తున్నారని... బ్రాందీ షాపు పక్కనే ఒక బార్ వెలసిందని ఆగ్రహించారు భూమన కరుణాకరరెడ్డి.  ఎక్సైజ్ అధికారిలు పట్టించుకోవడం లేదన్నారు.


మందు బాబులు ఆగడాలు ఎక్కువై పోయాయని... దీనికి కొనసాగింపు గా తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారు ఆలయం కు వెళ్ళే మార్గంలో ఈ రెస్టారెంట్ ఉందని తెలిపారు. టౌన్ ప్లానింగ్ అవినీతి అధికారి సొమ్ముతో ఈ రెస్టారెంట్ నడుపుతున్నారని ఆరోపణలు చేశారు భూమన కరుణాకరరెడ్డి. ఈ ప్రభుత్వం మద్దతు ఉంది అనే ధైర్యం తో మత్తు పదార్థాలు తో విన్యాసం చేస్తున్నారన్నారు. తిరుపతి లో ఈ రెస్టారెంట్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు భూమన కరుణాకరరెడ్డి.

అధికారులు మరింత సీరియస్ ఈ అంశం తీసుకోవాలని కోరారు. రెస్టారెంట్ లో జరుగుతున్న దానిపై విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. దీనిపై మేము కూడా నిఘా పెడతామని హెచ్చరించారు భూమన కరుణాకరరెడ్డి. తిరుపతి పవిత్రతను కాపాడతానని చంద్రబాబు చెప్తున్నారు, మీరు దృష్టి పెట్టండని కోరారు. మొదటిసారిగా చూస్తున్నాం ఈ విధమైన కల్చర్ అంటూ విమర్శలు చేశారు.  తిరుపతిలో ఒక దుష్ట సంస్కృతికి బీజం పడింది, చట్ట వ్యతిరేకమంటూ ఫైర్‌ అయ్యారు. తిరుపతిలో రాత్రి 12 గంటల వరకు బ్రాందీ షాపు లు నడుపుతున్నారని నిప్పులు చెరిగారు. చంద్రబాబు చెప్పేవి శ్రీరంగ నీతులు, చేసేవి మరొకటి అంటూ చురకలు అంటించారు భూమన కరుణాకరరెడ్డి.

మరింత సమాచారం తెలుసుకోండి: