ఈ విషయాన్ని వివరంగా చెప్పడంతో వైసిపి కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు సైతం వైరల్ గా చేస్తున్నారు. జగన్ కి చెప్పుకోవడం చేతకాలేదు కానీ మోడీ చెప్పారు చూడండి అంటూ హైలెట్ చేస్తూ ఉన్నారు..2014-2017 నాటికి 93,9003 కోట్ల ఆదాయం ఉంటే..2018-19 నాటికి 1,54,333 కోట్లు.. చంద్రబాబు ఐదేళ్ల హయాంలో ఆంధ్రప్రదేశ్ ఆదాయం పెరిగింది 60 ,128 కోట్ల రూపాయలు అన్నట్లుగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమాచారం ఇదే..
వరుసగా రెండేళ్లపాటు కరోనా వల్ల 70 వేల కోట్లు నష్టం వచ్చినా కూడా.. 2023-24 రాష్ట్ర ఆదాయం 2,42,479 కోట్ల రూపాయల ఉన్నదట.. ఐదేళ్లలో జగన్ పాలనలో పెరిగిన ఆదాయం ఎంత అంటే.. 88,848 కోట్లు అన్నమాట.. అయితే చంద్రబాబు హయాంలో పెంచినటువంటి ఆదాయం 60, 128 కోట్లు అయితే అయితే జగన్ హయాంలో 88, 848 కోట్లు.. ఈ విషయం పైన మోదీ అనే సర్టిఫికెట్ ఇచ్చారని కూడా తెలియజేశారు వైసీపీ నేతలు.. దీంతో అటు టిడిపి నేతలు అందరు ఈ విషయం మీద ముక్కున వేలు వేసుకున్నారంటే వైసీపీ నేతలు కార్యకర్తలు అభిమానులు తెలుపుతున్నారు.