కోమటిరెడ్డి బ్రదర్స్ లో ఒకరైన రాజగోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డికి మంచి సన్నిహితుడు కానీ అతను అప్పట్లో కాంగ్రెస్‌ను కాదని బీజేపీలో చేరారు. తర్వాత కమలం పార్టీ టికెట్‌ పై పోటి చేసి ఓడిపోయారు. మళ్ళీ కాంగ్రెస్ గూటికి వస్తే రేవంత్ రెడ్డి అభ్యంతరం తెలపడం జరిగింది. దాంతో వారిద్దరి మధ్య చెడింది. అయినా అతని కాంగ్రెస్‌లో చేరాలనే తన ప్రయత్నాన్ని మానుకోలేదు. కాంగ్రెస్ అధిష్టానం వద్దకు వెళ్లి రిక్వెస్ట్ చేస్తే జాయిన్ చేసుకున్నారు. అలా పోయినసారి ఎన్నికల్లో ఘన విజయం సాధించారు.

రాజగోపాల్ రెడ్డికి, రేవంత్ కి పొసగడం లేదు కానీ రాజగోపాల్ ప్రస్తుత ప్రభుత్వంలో బాగా ఎదగాలని ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా మంత్రి కావాలని ఆయన ట్రై చేస్తున్నారు. ఆయన బ్రదర్ వెంకట్ రెడ్డి ఆల్రెడీ మంత్రి అయిపోయారు. అతన్ని మాత్రం బాగా గౌరవిస్తున్నారు కానీ రాజగోపాల్ రెడ్డికి ఎలాంటి ప్రాధాన్యత లభించడం లేదు. దాంతో ఆయన బాగా ఫ్రస్ట్రేషన్‌కి గురవుతున్నట్లు తెలుస్తోంది.

ఆయన తెలంగాణ అసెంబ్లీ నిర్మాణం గురించి తాజాగా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు కూడా తన ఫ్రస్ట్రేషన్‌లో భాగంగానే వచ్చాయని అంటున్నారు. రాజగోపాల్ రెడ్డి కొత్త తెలంగాణ అసెంబ్లీని సచివాలయం పక్కనే ఉన్న ఎన్టీఆర్ గార్డెన్స్ లో నిర్మిస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ ఈ వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపే ఎన్టీఆర్ గార్డెన్స్ ను టచ్ చేస్తే చూస్తూ ఊరుకునేది లేదంటూ టిడిపి శ్రేణులు పెద్ద ఎత్తున హెచ్చరికలు జారీ చేశాయి. ఎన్టీఆర్ సమాధిని తీయడానికి ప్రయత్నించి చూడండి ఏమవుతుందో తెలుస్తుంది అన్నట్లుగా సవాలు కూడా విసరడం జరిగింది. అయితే ఈ స్టేట్మెంట్ చేస్తే ఇలాంటి రియాక్షన్ వస్తుందని రాజగోపాల్ రెడ్డికి తెలుసు. అందుకే ఆయన అలా కామెంట్ చేశారు. అసలు ఆయన తెలంగాణ రాజకీయాల్లో ఉన్నారా లేదా అనే పరిస్థితి ఏర్పడింది. అలా మరుగున పడిపోవడం అతనికి ఇష్టం లేకపోవడం వల్లే ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని పొలిటికల్ అనలిస్టులు విశ్లేషిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: