- ( కృష్ణా - ఇండియా హెరాల్డ్ ) . .


రాజకీయాల్లో శాశ్వత శత్రువులు .. శాశ్వత మిత్రులు ఉండరని మాట అందరికీ తెలిసిందే. ప్రస్తుతం కృష్ణా జిల్లా బందరు రాజకీయాలలో అదే జరుగుతోంది. అధికారం ఉన్న లేకున్నా రాజకీయ నేతలు కుంభకోణాలు .. వివిధ అవినీతి ఆరోపణలలో చిక్కుకుంటే ఒకరిని ఒకరు కాపాడుకునే ప్రయత్నం తెరవెనక జరుగుతోందట. తాజాగా నూజివీడులో సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహ ఆవిష్కరణలో టిడిపి ఎమ్మెల్యేలు .. మంత్రి కొలుసు పార్థసారథి .. ఆర్టీసీ చైర్మన్ కొనకల్ల నారాయణతో పాటు గతంలో చంద్రబాబు నివాసం పైకి వెళ్లిన జోగి రమేష్ ర్యాలీ సభా వేదికపై పాలు పంచుకున్నారు. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా టిడిపి లీడర్ నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఇక వారం రోజులుగా బందరుకు చెందిన మాజీ మంత్రి పేర్ని నానికి చెందిన గోడౌన్ల‌ నుంచి 4000 బస్తాల బియ్యం మాయమైన ఘటన వెలుగులోకి వచ్చిన అధికార పార్టీ నేతలు పెదవి విపటం లేదు. దీనిపై ఇప్పుడు టిడిపి కార్యకర్తలు మధ్య చర్చి జరుగుతుంది.


సోమవారం మంత్రి కొల్లు రవీంద్ర మీడియా సమావేశం పెట్టటం మినహా ఏ ఒక్క నేత కూడా మాట్లాడలేదు. బందరు నియోజకవర్గంలో పగలు అందరూ పార్టీల పరంగా విమర్శలు చేసుకున్న ... రాత్రి అయ్యే సరికి ఒకరి భుజంపై ఒకరు చేతులు వేసుకునే సరదాగా గడుపుతారట. అందుకే ఎవరు అవినీతి ఆరోపణలలో చిక్కుకున్న స్పందించరు. తాజాగా పేర్ని నాని విషయంలో కూటమి నేతలు ఎవరూ స్పందించకపోవటానికి తెరవెనక బలమైన బంధాల కారణం అంటున్నారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న పేర్ని నాని తరచూ కూటమి ప్రభుత్వ వైఫల్యాలు ఇతర అంశాలపై మీడియాలో విమర్శలు చేస్తూ ఉంటారు.


ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేసేందుకు వైసీపీ తరఫున పేర్ని నానినే జగన్మోహన్ రెడ్డి సాధనంలా వాడుకుంటారు. అయితే ఇప్పుడు ఆయన పిడిఎఫ్ బియ్యం మాయం కేసులో చిక్కుకున్నారు. జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు టిడిపి సీనియర్ నేతలు .. టిడిపి జిల్లా అధ్యక్షుడు నియోజకవర్గ కూటమి నేతలు ఎవరు కూడా పేర్ని నాని అక్రమాలపై విచారణ చేయాలని డిమాండ్ చేయకపోవడం విశేషం. అంతేకాకుండా ఈ కేసులో అధికారులు పేరు నానిపై చర్యలు తీసుకోకుండా తెరవెనక అధికార పక్ష నేతలే ఒత్తిడి చేస్తున్నట్టు సమాచారం. ఏది ఏమైనా ఈ జిల్లాలో కూటమి నేతలే వైసిపి నేతలను కాపాడుతున్న పరిస్థితి.

మరింత సమాచారం తెలుసుకోండి: