భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్ష మార్పు అతి త్వరలోనే జరగనుంది. పార్లమెంట్ ఎన్నికలు పూర్తయి దాదాపు 6 మాసాలు అయినప్పటికీ.. ఇప్పటికి కూడా బిజెపి అధ్యక్షుడు ఎవరు అనే దానిపైన ఇంకా క్లారిటీ కాలేదు. ప్రస్తుతానికి జెపి నడ్డా భారతీయజనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఎన్నికల కంటే ముందు కూడా ఆయనే ఉన్నారు. అయితే ఎన్నికల కంటే ముందు జెపి నడ్డా ను మార్చుతారని వార్తలు వచ్చాయి.

కానీ బిజెపి పార్టీకి ఇబ్బంది ఎదురు అవుతుందని... జెపి నడ్డానే కొనసాగించారు. అయితే ఇప్పుడు జెపి నడ్డా వైదొలగనున్నారు. దీంతో జనవరి మాసంలో బీజేపీ పార్టీకి కొత్త అధ్యక్షుడు రాబోతున్నాడని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. కచ్చితంగా జనవరిలో ఈ మార్పు అయితే ఉంటుందట. అయితే జేపీ నడ్డా స్థానంలో ఎవరిని నియామకం చేయాలని దాని పైన.. ఆర్ఎస్ఎస్ అలాగే బిజెపి పెద్దలు కసరత్తులు చేస్తున్నారు. ఇప్పటికే తెరపైకి చాలా పేర్లు వచ్చాయి.


అందులో శివరాజ్ సింగ్ చౌహాన్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌, ఇటు నితిన్ గడ్కరి పేర్లు ఉన్నాయి. అయితే చాలా మంది... నితిన్ గడ్కార్ కి ఇవ్వాలని కూడా అంటున్నారు. ఆయన ఆర్ఎస్ఎస్ కు చాలా దగ్గరగా ఉంటారు.  అలాగే బిజెపిలో కీలక నేత.  ప్రధాని అభ్యర్థి కూడా నితిన్ గడ్కరి అన్న సంగతి తెలిసిందే. కానీ అమిత్ షా వర్గానికి...  ఇటు నితిన్ గడ్కరి వర్గానికి దూరం బాగా ఉందట.


ఒకవేళ నితిన్ గడ్కరి బిజెపి జాతీయ అధ్యక్షుడు అయితే... అధికారంలో ఉన్న అమిత్ షా ఆటలు సాగబోవని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. మొన్నటి వరకు ఉన్న అధ్యక్షులుగా ఉన్న జేపీ నడ్డా.. అమిత్‌ షా చెప్పిన మాట వినేవాడు. కానీ... ఇప్పుడు నితిన్‌ గడ్కరీ.. బీజేపీ ఛీప్‌ అయితే...  అమిత్ షాకు కష్టాలు తప్పవని అంటున్నారు. బీజేపీ సర్కార్‌ గత 10 ఏళ్లలో నితిన్‌ గడ్కరీని అవమానిస్తోందని కూడా వాదన ఉంది. దీంతో.. నితిన్‌ గడ్కరీ చీఫ్‌.. అయితే... బీజేపీ సర్కార్‌ కు ఇబ్బంది తప్పదని చెబుతున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: