గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై తాజాగా ఏసీబీ కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసులో ఏ 1 ముద్దాయిగా కల్వకుంట్ల తారక రామారావు పేరు ను కేసు నమోదు చేశారు ఏసీబీ అధికారులు. అలాగే A2 ముద్దాయిగా అరబింద్ కుమార్ ను చేర్చారు. అటు A3 గా బి ఎల్ ఎన్ రెడ్డి పేర్లను చేర్చారు ఏసీబీ అధికారులు. ఈ మేరకు నోటీసులు కూడా... రెడీ అవుతున్నాయట.
అయితే నోటీసులు ఇవ్వకుండానే కల్వకుంట్ల తారక రామారావును అరెస్టు చేస్తారని వార్తలు వస్తున్నాయి. అది కూడా రేపు అంటే శుక్రవారం రోజున కేటీఆర్ ను అరెస్టు చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం అందుతుంది. గత శుక్రవారం హీరో అల్లుఅర్జున్ అరెస్టు చేసినట్లుగానే కేటీఆర్ ను అరెస్టు చేస్తారని అంటున్నారు. ప్రతి వీకెండ్స్ లో పక్క ప్లాన్ తో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అరెస్టులకు తెరలేపుతోంది.
ఈ సారి కేటీఆర్ ను టార్గెట్ చేసినట్లు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పై విమర్శలు వస్తున్నాయి. కాగా ఫార్ములా ఈ కారు రేసులో.. దాదాపు 40 కోట్లు... నొక్కేశారని కేటీఆర్ పై ఆరోపణలు వస్తున్నాయి. విదేశీ కంపెనీల పేరుతో లోపల అవేసారని... కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఆరోపణలు చేస్తోంది. కాగా ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో బాగంగానే... కేటీఆర్‌పై 4 సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది ఏసీబీ. 13 (1) A, 13 (2) పీసీ యాక్ట్, 409, 120B కింద కేసు నమోదు చేశారు అధికారులు.