ఈ ప్రపంచంలో హిందువులంటే అందరికీ చులకన అని ఎన్నోసార్లు ప్రూవ్ అయింది. హిందువులను చాలామంది బాగా టార్గెట్ చేస్తుంటారు. వీరు ఎవరు ఏమన్నా సరే ఐక్యం కారని, ఎలాంటి గొడవలు చేయరు అనే ఒక భావన ప్రజల్లోకి వెళ్ళింది. అందుకే హిందువులను ఎక్కువగా వేరే వ్యక్తులు టార్గెట్ చేస్తున్నారు. ముస్లింలు, క్రైస్తవులు తమ మతాన్ని ఏదైనా అంటే వెంటనే ఖండిస్తారు. వారంతా ఏకతాటి పైకి వచ్చి తమ మతం జోలికి వచ్చిన వారి దుమ్ము దులిపేస్తారు. కానీ హిందువుల విషయంలో అలా ఐకమత్యం లేదనేది చాలామంది చెబుతున్న మాట. అందుకే ఇటీవల తమిళ నాడు సీఎం ఒక సంచలన ఆదేశం నిర్భయంగా పాస్ చేసి ఆశ్చర్యపరిచారు.
ఆయన ఆర్డర్ ఏం చెబుతుందంటే హిందూ పూజారులు మంత్రాలను తమిళంలోనే చదవాలట. సాధారణంగా హిందువులు సంస్కృతంలో మంత్రాలు చదువుతారు. అది ఇప్పటిది కాదు కొన్ని వందల సంవత్సరాలుగా కొనసాగుతున్న ఆచారం. నిజం చెప్పాలంటే ముస్లిం క్రైస్తవులు మొదటినుంచి ఏ భాషల్లో ప్రార్థనలు చేస్తున్నారో ఇప్పుడు అదే భాషల్లో ప్రేయర్ చేస్తారు. వారిని అలా ప్రేయర్ చేయొద్దని చెప్తే ఎలాంటి సీఎం అయినా కూర్చి దిగిపోవాల్సిందే. ఆ విషయంలో కలగజేసుకునే హక్కు వారికి లేదని చెప్పొచ్చు. కానీ తమిళనాడు సీఎం మాత్రం హిందువులు తనని ఏం చేస్తారనే ధీమాతో పూజారులు కచ్చితంగా తమిళంలోనే మంత్రాలు చదవాలంటూ ఒక హుకం జారీ చేశారు. ఇప్పుడు ఇది భారతదేశ వ్యాప్తంగా పెద్ద సంచలనం అయ్యింది.
M. K. స్టాలిన్ హిందుత్వంపై పెద్ద దాడి చేస్తున్నారు అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయ్యా సీఎం గారు ఇదేం పైత్యం ఇప్పుడు ఉన్నఫలంగా సంస్కృత శ్లోకాలు, మంత్రాలను తమిళంలోకి అనువదించాల్సిన అవసరం ఏంటి? అందరికీ సమన్యాయం ఉండాలి కదా, మిగతా వారికి కూడా ఇలాగే ఆదేశాలు ఇవ్వండి అని కొందరు సూటిగా నిలదీస్తున్నారు. వాస్తవానికి హిందూ పూజారులు శ్లోకాలు సంస్కృతంలోని చదువుతారు కానీ వాటిని మాతృభాషలోనే విడమర్చి చెబుతారు. మరి శ్లోకాలను, మంత్రాలను మార్చాల్సిన అవసరం ఏముంది అనేది ఇప్పుడు అసలైన ప్రశ్నగా మారింది.