ఇలాంటి సమయంలోనే అనంతపురం జిల్లా ధర్మవరంలో వైసిపి నేతగా పేరుపొందిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి జనసేన పార్టీలోకి చేర్చుకోవడం కోసం చాలామంది నేతలు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారట. ముఖ్యంగా కేతిరెడ్డి నిత్యం ప్రజలలో ఉంటూ వారి యొక్క అవసరాలను సైతం తెలుసుకొని మరి సమస్యలను పరిష్కరిస్తూ ప్రజల మనిషిగా పేరు సంపాదించారు. గత ఎన్నికలలో తప్పకుండా ఈయన మంచి విజయాన్ని సాధిస్తారు అనుకున్నప్పటికీ ఊహించని విధంగా కేతిరెడ్డి ఓడిపోవడంతో కొంతకాలం డిప్రెషన్ లోకి వెళ్లిపోయారు.
ఆ తర్వాత వైపాక తీరు పైన కొన్ని విమర్శలు చేసిన.. ఆ తర్వాత నెమ్మదిగా అన్ని సద్దుమణుగుతున్న సమయంలో కొంతమంది జనసేన నేతలు ఈ నాయకుడిని తమవైపు తిప్పుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీంతో కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ని కలిసిన కొంతమంది జనసేన నేతలు ఆయనకు ఒక బంపర్ ఆఫర్ కూడా ప్రకటించినట్లు సమాచారం. పార్టీలోకి వచ్చిన వెంటనే పదవులు కూడా ఇప్పిస్తామని ఆశ చూపించినప్పటికీ కేతిరెడ్డి మాత్రం తాను వైసిపి పార్టీలోనే ఉంటానని జగన్ ని వదిలి బయటికి రాలేనని కూడా నిర్మొహమాటంగా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. జనసేన నేతలు ఇచ్చిన బంపర్ ఆఫర్ ను తిరస్కరించడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇలాంటి నాయకులే పార్టీలకు కావాలి అంటూ పలువురు నేతలు అభిమానులు కూడా ప్రశంసిస్తున్నారు.