- ( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ ) . .

వైసీపీ అధినేత జగన్ సొంత జిల్లా ఉమ్మడి కడప జిల్లాలో రాజకీయాలు శ‌రవేగంగా మారుతున్నాయి. ఇప్పటికే కడప కార్పొరేషన్ పరిధిలో వైసీపీకి చెందిన పలువురు కార్పొరేటర్లు పార్టీ మారి టిడిపిలోకి రెడీ అవుతున్నారు. వీరిని కాపాడుకునేందుకు ఎంపీ అవినాష్ రెడ్డి రంగంలోకి దింపిన ఫలితం కనిపించడం లేదు. ఇక సాగునీటి సంఘాల ఎన్నికల్లో కూడా వైసిపి చేతులు ఎత్తేసింది. ఫలితంగా ఉమ్మడి కడపలో వైసిపి తగ్గుతున్న వాతావరణం కనిపిస్తుంది. ఇక తాజా సమాచారం ప్రకారం బద్వేల్ వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ సుధ ను టిడిపిలోకి తీసుకొనే దిశగా ప్రయత్నాలు మొదలైనట్టు తెలుస్తుంది. ఇప్పటి కే నియోజకవర్గ నాయకులు ఆమెతో రెండు మూడు సార్లు చర్చించారని సమాచారం. బద్వేల్ నుంచి సుధ ఉప ఎన్నికలలో ఒకసారి మొన్న సాధారణ ఎన్నికలలో మరోసారి వరుసగా రెండుసార్లు విజయం సాధించారు.


వైసీపీలో నెలకొన్న వర్గ విభేదాలు కారణంగా ఆమె ఎటుపక్షం వహించాలో తెలియక సతమతం అవుతున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆమెను చాలా ఇబ్బందులు పెట్టారు. ఇప్పుడు నియోజకవర్గ అభివృద్ధి అంశం కూడా తలనొప్పిగా మారింది .. రాష్ట్రం లో టిడిపి హవా కొనసాగుతూ ఉండడంతో ఆమె వైసీపీలో ఉండేందుకు ఇంట్రెస్ట్ చూపటం లేదని .. పైగా వైసిపి అధినేత జగన్ తీరుతో ఆమె తీవ్ర అసంతృప్తిగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనా సుధ ఫ్యాన్ కింద నుంచి బయటకు వచ్చే సైకిల్ ఎక్కేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. టీ డీపీలో ఇక్క‌డ ప‌రిణామాలు కూడా ఆమె కు క‌లిసి రానున్నాయి. సుధ‌ను ఎలా అయినా పార్టీ లోకి తీసుకోవాల‌ని టీడీపీ నాయ‌క‌త్వ‌మే ఇష్టంతో ఉంద‌ట‌. ఇక జిల్లా కే చెందిన ప‌లువురు స్థానిక సంస్థ‌ల ప్ర‌జా ప్ర‌తి నిధులు సైతం సైకిల్ ఎక్కేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: