- ( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ ) . .


ముఖ్యమంత్రి చంద్రబాబుతో పని విషయంలో పరుగులు పెట్టటం ఎవరికి సాధ్యం కాదు అన్నది అందరికీ తెలిసిందే. చంద్రబాబును పని రాక్షసుడు అంటారు 30 ఏళ్ల క్రితం యంగ్ సీఎంగా ఉన్నప్పుడు ఆయన ఎంత చురుకుగా డైనమిక్ గా ఉండేవారో ఇప్పుడు అలాగే ఉంటున్నారు. బాబు తనతో పాటు మంత్రులు కూడా అలాగే పరుగులు పెట్టాలని కోరుకుంటూ ఉంటారు. అంతేకాదు వారికి కొన్ని పారామీటర్స్ పెట్టి మరి పరీక్షలు పెడితే ఉంటారు. ప్రతి నెలలోనూ మంత్రుల పనితీరు మీద బాబు దగ్గరికి నివేదికలు వస్తున్నాయి. మరోవైపు చంద్రబాబు మంత్రివర్గ సమావేశంలో కూడా మంత్రులకు గైడెన్స్ ఇస్తూ మంత్రులందరూ సక్రమంగా పనిచేయాలని సూచనలు చేస్తూ ఉంటారు. కూటమి ప్రభుత్వం ఆరు నెలలు పూర్తి చేసుకుంది. చంద్రబాబు గుడ్ లుక్స్ లో ఉన్న మంత్రులు వీరే అంటూ కొన్ని పేర్లు ప్రచారంలో ఉన్నాయి.


ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ .. విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ .. మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ .. విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ .. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ .. చిన్నతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చంద్రబాబు గుడ్ లుక్స్ లో ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే కొంతమంది మంత్రులు ప్రతి విషయంలో చంద్రబాబు అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. మరి ముఖ్యంగా తొలిసారి మంత్రులుగా అవకాశం ఇచ్చిన వారిలో కొందరు చాలా పూర్ పెర్ఫార్మన్స్ ఇస్తున్నారని చంద్రబాబు నిరాశ తో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న మంత్రులలో ఎవరైనా చంద్రబాబు ఆశించినట్టుగా పనితీరు మార్చుకోకపోతే చంద్రబాబు కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. మ‌రి ఇక పై అయినా పూర్ పెర్పామెన్స్ ఇస్తోన్న మంత్రులు ప‌ని తీరు మార్చుకుంటారేమో ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: