తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఆరో రోజు కూడా విజయవంతంగా కొనసాగనున్నాయి. నేడు ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని నిలుపుదల చేయగా ఈ ఉదయం 10 గంటలకు "భూ భారతి'' బిల్లుపై చర్చతో శాసనసభ అయింది. మొదట హైడ్రాకు అధికారాలను కట్టబెట్టేదానిపై మంత్రి శ్రీధర్‌ బాబు మాట్లాడడం జరిగింది. ఇక జీహెచ్‌ఎంసీ చట్టంలో సెక్షన్‌ 374బి చేర్చడం ద్వారా హైడ్రా కమిషనర్‌కు అధికారాలను కట్టబెడుతున్నట్లు కూడా శాసనసభ వ్యవహారాల మంత్రి ఈ సందర్భంగా వెల్లడించడం జరిగింది. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వం హైడ్రాను తెచ్చిందని కూడా స్పష్టం చేశారు. దీనిపై బీఆర్‌ఎస్‌, బీజేపీ సభ్యులు పలు అభ్యంతరాలు లేవనెత్తారు. అనాలోచితంగా అనేక నిర్మణాలను కూల్చేస్తూ, పేదలు, మధ్యతరగతి వారు భయపడే పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిందని బీఆర్‌ఎస్ సభ్యులు విమర్శించారు.

ఆ తరువాతే మొదలైంది అసలు రచ్చ. అవును, ఫార్ములా ఈ-రేస్ పై అసెంబ్లీలో చర్చించాలని బీఆర్‌ఎస్‌ ఓ వాయిదా తీర్మానం చేసింది. దాని స్పీకర్ గడ్డం ప్రసాద్ ఖండిస్తూ... "ఇక్కడ రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి చర్చ నడుస్తోంది. ఓ వ్యక్తి గురించి ఇక్కడ మాట్లాడడం సరికాదు... అది ఇంకెక్కడైనా చూసుకుందాం!" అని చెప్పగా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు స్పీకర్ గడ్డం ప్రసాద్ పైకి నిరసనగా పేపర్లు విసరడం జరిగింది. దాంతో మొత్తం సభలోని గందరగోళం ఏర్పడింది.

దాంతో సభ కాసేపు సవ్యంగా జరగలేదు. ఆ తరువాత రైతు భరోసా విధివిధానాలపై స్వల్పకాలిక చర్చ మొదలైంది. ఆపైన నేడు శాసన మండలిలో జీహెచ్‌ఎంసీ సవరణ బిల్లు, తెలంగాన మున్సిపాలిటీల సవరణ బిల్లు, పంచాయతీరాజ్‌ సవరణ బిల్లు సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి సీతక్కలు ప్రవేశ పెట్టడం జరుగుతుంది. మండలిలో రైతు బరోసా విధి విధానాలపై కూడా లఘు చర్చ ఉండనుంది. ఇక హైదరాబాద్ ఫార్ములా ఈ- కార్ రేస్ కేసు విషయానికొస్తే... అవినీతి నిరోధక శాఖ (ACB) దానిపై దూకుడు పెంచినట్టు కనబడుతోంది. ఇప్పటికే ఈ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ సహా.. ముగ్గురిపై నాలుగు సెక్షన్ల కింద నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: