"దమ్ముంటే అరెస్ట్ చేయండి చూద్దాం... మా లీడర్‌ను అరెస్ట్ చేస్తే మాత్రం తెలంగాణ తగలబడిపోతుంది!" అని గత కొన్ని రోజులుగా కేటీఆర్ ని ఉద్దేశించి బీఆర్ఎస్ నేతలు కొడుతున్న ఈ డైలాగ్‌లు గత కొన్ని రోజులుగా వినబడడం లేదు! దానికి కారణం అందరికీ తెలిసిందే. ఫార్ములా ఈ రేసింగ్ మనీ ట్రాన్స్ ఫర్ కేసులో బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ ప్రధాన నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. కాగా ఫార్ములా ఈ రేస్ పై దర్యాప్తు చేసుకోవచ్చని గవర్నర్ కూడా ఆమోదించడంతో ఇపుడు కేటీఆర్ విషయంలో మెల్లమెల్లగా ఉచ్చు బిగుసుకున్నట్టు కనబడుతోంది. ఈ క్రమంలో త్వరలో కేటీఆర్ అరెస్ట్ తప్పదంటూ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అవును, నిన్న మొన్నటివరకు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్న గులాబీ లీడర్ల గుండెల్లో తాజాగా గుబులు బయలుదేరింది. కేసు నమోదవుతుందనుకుంటే ఎవరైనా మొదట డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేస్తారు కానీ.. కేటీఆర్ అలా చేయలేదు. మరి ఏం నమ్మకమో కానీ, దమ్ముంటే అరెస్ట్ చేస్తే చేస్కోండి! అంటూ చెవాక్కులు విసిరాడు. కానీ అది ఇపుడు నిజమయ్యేలా కనబడడంతో గులాబీ నేతలు మిన్నకుంటున్నారు. వాస్తవానికి ఫార్ములా ఈ రేసింగ్ విషయంలో తప్పులు కచ్చితంగా జరిగాయి అంటూ కొంతమంది విశ్లేషకులు చెబుతున్నమాట. ఎందుకంటే ఆఘమేఘాల మీద ఆర్బీఐ అనుమతి లేకుండా, క్యాబినెట్ ను సంప్రదించకుండా, పైగా ఎన్నికల కోడ్ కూడా అమలులో ఉండగా, 55 కోట్ల రూపాయలను ట్రాన్స్ ఫర్ చేయడం అనేది జరిగింది. దాన్ని ఎవరూ అబద్ధం చేయలేరు అని బల్లగుద్ది మరీ చెబుతున్నారు కాంగ్రెస్ నాయకులు!

అవును, వాస్తవానికి అయితే పరాయి దేశపు సంస్థ, కంపెనీకి పెద్ద మొత్తంలో డబ్బులు పంపాలంటే ఆర్బీఐ అనుమతి ఖచ్చితంగా తీసుకోవాలి. ట్యాక్స్ చెల్లించి పంపినా అందులో జరగాల్సిన ప్రాసెస్ చేయడానికే నెలల సమయం పడుతుంది. కానీ అపుడు అధికారంలో ఉన్న కేటీఆర్ అవేవీ పట్టించుకోలేదు. అందుకే ఏసీబీ విచారణ కోసం గవర్నర్ అనుమతి కోరగా తాజాగా గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇందులో మతలబులను బయటకు లాగడానికి ఇపుడు రెడీ అవుతోంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక గత కొన్ని రోజులుగా కేటీఆర్ సీన్ ఆఫ్ యాక్షన్ ప్లాన్స్ చూస్తుంటే అర్జంటుగా జైలుకు వెళ్లాలన్న తాపత్రయమే కనిపిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఫార్ములా ఈ రేసింగ్ పై క్యాబినెట్ అనుమతి లేదు, ఒప్పందాలు లేవు.. ఇలాంటి తరుణంలో నిధులను సింపుల్ గా సింగిల్ సిగ్నేచర్ తో FEOకి పంపించేశాడు కేటీఆర్ అంటూ విపక్షాలు ఆరోపిస్తున్నాయి. మరి ఈ విషయం ఎంతవరకు వెళుతుందో చూడాలి మరి!

మరింత సమాచారం తెలుసుకోండి: