ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి,  వైసిపి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. తాజాగా... వైయస్ జగన్మోహన్ రెడ్డి బర్త్ డే వేడుకలను కూడా జరుపుకోకుండా కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తానని వైసిపి నేతలు ఆరోపణలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు రేపు అన్న సంగతి తెలిసిందే. దీంతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలకు రంగం సిద్ధం చేస్తున్నారు వైసీపీ కార్యకర్తలు అలాగే జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్స్.


ఇందులో భాగంగానే చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన పుట్టినరోజు వేడుకలను... వైసిపి నేతల అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. అయితే ఈ వేడుకలకు... ఏపీ పోలీసులు ఊహించని షాక్ ఇచ్చారు. కుప్పం నియోజకవర్గంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి... పుట్టినరోజు వేడుకలు నిర్వహించకూడదని ఆదేశాలు జారీ చేశారు.


అలా కాదని ఎవరైనా రూల్స్ బ్రేక్ చేస్తే కచ్చితంగా జైల్లో వేస్తామని హెచ్చరించారు.దీంతో వైసిపి నేతలు కుప్పం నియోజకవర్గంలో టెన్షన్ పడుతున్నారు. వస్తావంగా ప్రస్తుతం కుప్పం నియోజకవర్గంలో నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి పర్యటిస్తున్నారు. నిన్నటి నుంచి మూడు రోజులపాటు... కుప్పం నియోజకవర్గంలో నారా భువనేశ్వరి పర్యటన కొనసాగనున్నట్లు వార్తలు వస్తున్నాయి.  జగన్మోహన్ రెడ్డి బర్త్ డే రేపు.. ఉంది.


రేపటి రోజున కూడా కుప్పం నియోజకవర్గంలో నారా భువనేశ్వరి పర్యటిస్తారట.అయితే నారా భువనేశ్వరి పర్యటన ఉన్న నేపథ్యంలో.. వైయస్ జగన్మోహన్ రెడ్డి వేడుకలకు ఆ నియోజకవర్గంలో... పర్మిషన్ లేదని ఏపీ పోలీసులు తెలుపుతున్నారు. ఏమైనా వేడుకలు ఉంటే పార్టీ ఆఫీసులో చేసుకోవాలని... బయట రచ్చ చేస్తే కఠిన చర్యలు తప్పమని పోలీసులు హెచ్చరించారు. అయితే దీనిపై స్థానిక వైసిపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భువనేశ్వరి వస్తే తమకేంటని... ప్రశ్నిస్తున్నారు. కచ్చితంగా   వైసిపి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి బర్త్ డే వేడుకలు జరుపుకుంటామని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: