కొన్ని రోజుల్లో ఉక్రెయిన్ ను లొంగదీసుకుంటామంటూ ప్రగల్భాలు పలుకుతూ 2022 ఫిబ్రవరి 24న సైనిక చర్య పేరిట యుద్ధం మొదలుపెట్టిన రష్యా.. ఇప్పుడు సైనికులు లేక విలవిల్లాడుతోంది.యెమెన్, ఉత్తర కొరియా వంటి దేశాల నుంచి సైనికులను తీసుకుంటోంది. మరోవైపు భారత్ వంటి దేశాలకు చెందిన యువకులను ఉద్యోగం పేరిట పిలిచి యుద్ధంలో దింపుతోంది. అయితే, రష్యా అధ్యక్షుడు పుతిన్ కు ఉన్న స్నేహ సంబంధాల రీత్యా ఉత్తర కొరియా నియంత కిమ్ తమ సైనికులను పంపారు. ఇక ఉక్రెయిన్ మాత్రం పశ్చిమ దేశాల ఆయుధాలతో రష్యన్-ఉక్రెయిన్ సైనికులపై పోరాడుతోంది. ఈ క్రమంలో రష్యాకు భారీ నష్టాలను కలుగజేసింది కూడా.
ఉక్రెయిన్ పై యుద్ధంలో చనిపోయిన ఉత్తర కొరియా సైనికుల ముఖాలను రష్యా కాల్చివేస్తున్నదట. ఈ విషయాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తెలిపారు. ఉత్తర కొరియా సైనికులను గుర్తుపట్టకుండా ముఖాలను కాల్చేస్తున్నారని ఆరోపించారు. అయితే, ఇతర దేశ సైనికులు యుద్ధంలో చనిపోయారని తెలిస్తే ఇబ్బందికరంగా భావించి రష్యా ఇలా చేస్తున్నట్లు తెలుస్తోంది.
కొన్ని నెలల కిందట రష్యా నుంచి కుర్స్క్ రీజియన్ ను ఉక్రెయిన్ స్వాధీనం చేసుకుంది. అక్కడ ఇప్పుడు మళ్లీ పట్టు బిగించేందుకు పుతిన్ సేనలు ప్రయత్నాలు చేస్తున్నాయి. అలా యుద్ధంలో పలువురు సైనికులు చనిపోతుండగా వాటిరి పాతిపెట్టడానికి ముందు ముఖాలను కాల్చివేస్తున్నట్లు తెలుస్తోంది. వీటికి సంబంధించిన వీడియోలను జెలెన్ స్కీ ఎక్స్ లో పోస్ట్ చేశారు. వీటిలో ఉత్తర కొరియా సైనికులను కాల్చినట్లు కనిపించింది.
కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతున్న యుద్ధంలో రష్యాకు విరక్తి రావడం లేదని.. పైకి తిరిగి ఇంకా దారుణాలకు పాల్పడుతోందని జెలెన్ స్కీ ఆరోపించారు. ఉత్తర కొరియా సైనికుల మరణాలను దాచడానికి ప్రయత్నిస్తోందన్నారు. కారణం లేకుండా ఉత్తర కొరియా సైనికులు పుతిన్ తరఫున పోరాడుతున్నారని.. చివరకు రష్యా వారికి అవమానాన్నే మిగుల్చుతోందని అన్నరు. ఇదొక పిచ్చి ప్రయత్నం అని.. దీనిని ఆపాలని కోరారు.