ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పార్టీ ప్రస్తుతం  గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.  పొద్దున లేస్తే చాలు ఏ లీడర్ జంప్ అవుతారో అని టెన్షన్ అందరిలోనూ ఉంది. ఇలాంటి నేపథ్యంలోనే తాజాగా విశాఖపట్నంలో వైసీపీ పార్టీకి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. విశాఖలో కీలకంగా ఉన్న ఓ బడా లీడర్ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది.  విశాఖపట్నంలో... ఉన్న విశాఖ డైరీ చైర్మన్ ఆడారి ఆనంద్... జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇచ్చారు.


 

తాజాగా వైసీపీ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటన చేశారు  విజయ డైరీ చైర్మన్ ఆడారి ఆనంద్.  వైసిపి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి అధికారికంగా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు  ఆనంద్. ఈ మేరకు వైసీపీ పార్టీకి  రాజీనామా చేసి పార్టీ పెద్దలకు ఆ లేఖను పంపించారట ఆనంద్. అయితే విశాఖ డైరీ చైర్మన్  ఆనందు తో పాటు మరో 12 మంది వైసీపీ పార్టీకి రాజీనామా చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

 

12 మంది విశాఖ డైరీ డైరెక్టర్లు కూడా రాజీనామా చేయడం జరిగిందట. విశాఖ డైరీ చైర్మన్ ఆడారి ఆనంద్ బాటలోనే తాము కూడా నడుస్తామని.... ప్రకటించి వైసిపి పార్టీకి రాజీనామా చేశారట. విశాఖ డైరీ చైర్మన్ ఆడారి ఆనంద్ తో పాటు 12 మంది డైరెక్టర్లు... రాజీనామా చేయడంతో తెలుగుదేశం పార్టీలోకి వాళ్లు వెళ్తారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే టిడిపి పార్టీ పెద్దలతో చర్చలు కూడా జరిపారట. టిడిపిలో మంచి అవకాశం రావడంతో ఇప్పుడు.... వైసీపీకి రాజీనామా చేసి జంప్ అవుతున్నారట.

 

అయితే విశాఖ డైరీ చైర్మన్ ఆనంద్ రాజీనామా చేయడంతో వైసిపి పార్టీ ఒక్కసారిగా డీలపడింది.  ఈ అటు రేపు వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు ఉన్న సంగతి తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో వైసిపి పార్టీకి ఈ ఎదురు దెబ్బ తగిలింది.  అంతేకాదు చాలా చోట్ల వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి బర్త్డే.... వేడుకలు నిర్వహించకుండా ఆంక్షలు విధిస్తున్నారట ఏపీ పోలీసులు. ముఖ్యంగా కుప్పం నియోజకవర్గంలో.... వైసిపి నేతలను అరెస్టు కూడా చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: