ఈ క్రమంలోనే సదరు కార్పొరేషన్లు.. మునిసిపాలిటీలను తక్షణమే రద్దు చేయాలన్నది వారి డిమాండ్ గా ఉంది. అయితే.. ఇప్పటికి రెండు సార్లు.. ఈ ప్రతిపాదనకు సీఎం చంద్రబాబు రెడ్ సిగ్నల్ ఇచ్చారు. ప్రజాస్వామ్య యుతంగా ఎన్నికైన.. స్థానిక సంస్థలను కూల్చేయడం సరికాదని చెబుతున్నారు. మేయర్లు, మునిసిపల్ చైర్మన్లపై అవిశ్వాస తీర్మానం పెట్టి.. అనవసరంగా రాజకీయాలు చేయడం సరికాదని కూడా అంటున్నారు. కానీ, ఈ విషయంలో టీడీపీ నాయకులు మాత్రం ఆయనతో విభేదిస్తున్నారు.
తక్షణమే కాకపోయినా.. వచ్చే మూడు మాసాల్లో అయినా.. వైసీపీ నేతలను పదవీచ్యుతలను చేసి.. కార్పొ రేషన్లలో పాగా వేయాలన్నది తమ్ముళ్ల భావన. కానీ, చంద్రబాబుససేమిరా అంటున్నారు. మరి దీనికి కార ణం ఏంటి? అంటే.. రాష్ట్రంలో ఎమ్మెల్యేను తీసుకుంటే.. వ్యక్తిగతంగా అది ఆయన తప్పు.. అని నిరూపిం చేందుకు అవకాశం ఉంటుంది. ఆయన ఏదో ఆశించి.. పార్టీ మారారని చెప్పుకొనేందుకు అవకాశం ఉంటుంది. ఇది ప్రజలకు కూడాఅర్థమవుతుంది.
కానీ, స్థానికంగా ఉన్న కార్పొరేషన్లు, మునిసిపాలిటీలను ఇప్పటికిప్పుడు హస్తగతం చేసుకుంటే.. అది ప్రజల్లోకి త్వరగా చేరిపోయి.. పార్టీపై విమర్శలు వచ్చే అవకాశంఉందని చంద్రబాబు భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే ఆయన.. స్థానిక సంస్థల విషయంలో ఆచి తూచి వ్యవహరిస్తున్నారు. తాజాగా జరిగిన మంత్రి వర్గ సమావేశంలో కూడా.. ఈ విషయం చర్చకు వచ్చింది. కార్పొరేషన్లు మునిసిపాలిటీల ను హస్తగతం చేసుకునేందుకు ఎక్కువ మంది మంత్రులు మొగ్గు చూపినా.. ఇప్పటికిప్పుడు వద్దని సీఎం చంద్రబాబు స్ఫష్టం చేశారు. మరి మున్ముందు ఏం జరుగుతుందో చూడాలి.