రాజకీయాల్లో అన్నీ చూస్తారు .. ఇక్కడ సెంటిమెంట్లు లేని వారు ఉండరు. అయితే ఒక్కోసారి కొందరు అలా ఎంట్రీ ఇవ్వడంతోనే సడన్గా హీరోలు అయిపోతారు .. వాళ్ళ జాతకం మారిపోతుంది. ఉదాహరణకు వైసీపీలో ఉన్నప్పుడు అప్పటి మంత్రి సీనియర్ నేత విశ్వరూప్ పై ఎదురు తిరిగిన వైసిపి సాధారణ కార్యకర్త వాసంశెట్టి సుభాష్ ఎన్నికలకు ముందు టిడిపిలోకి రావటం .. అనూహ్యం గా రామచంద్రపురం టిడిపి సీటు దక్కించుకోవడం ఎమ్మెల్యేగా గెలవడం చంద్రబాబు క్యాబినెట్లో మంత్రి అయిపోవడం చకచకా జరిగిపోయాయి. అసలు జస్ట్ అలా కళ్లు మూసి కళ్లె తెరిచే లోన ఇలా జరిగిపోయింది. అలాగే గుంటూరుకు చెందిన ఎన్నారై పెమ్మసాని చంద్రశేఖర్ కూడా గత 7 - 8 నెలల క్రితమే రాజకీయాల్లోకి వచ్చారు. గత రెండుసార్లు గుంటూరు నుంచి టిడిపి తరఫున ఎంపీగా గెలిచిన గల్లా జయదేవ్ ఈసారి ఎన్నికలలో పోటీ చేయనని చెప్పారు. దీంతో చంద్రశేఖరకు ఆ అదృష్టం దక్కింది.
చంద్రశేఖర్ కు టిడిపి ఎంపీ సీటు దక్కటం ఆయన ఎంపీగావైసీపీ నుంచి పోటీ చేసిన కిలారు వెంకట రోశయ్య పై భారీ మెజార్టీతో విజయం సాధించటం .. అనూహ్యంగా టిడిపి కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వంలో చేరటం ... ఆయనకు తెలుగుదేశం కోటాలో కేంద్ర సహాయ మంత్రి పదవి దక్కటం చకచగా జరిగిపోయాయి. వాస్తవానికి పెమ్మసాని చంద్రశేఖర్ 2014 - 2019 ఎన్నికలలో నరసాపురం ఎంపీ సీటు ఆశించినా దక్కలేదు. అనూహ్యంగా ఈ ఎన్నికలలో గుంటూరు ఎంపీ సీటు రావడం ఆయన గెలవటం జరిగిపోయాయి. కీలకమైన కేంద్ర గ్రామీణ అభివృద్ధి - కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రిగా ఆయనకు అవకాశం వచ్చింది. ఎన్నారై గా ఉంటూ పెమ్మసాని కి ఇది అరుదైన అదృష్టంగా చెప్పాలి. ఆయనకు 2004 క్యాలెండర్ ఇచ్చిన గొప్ప గిఫ్ట్ గా రాజకీయ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.