ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ మార్పు చేర్పుల తర్వాత పవన్ కళ్యాణ్ మంత్రిత్వ శాఖలో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటా యన్న వార్తలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు త్వరలోనే ఏపీ క్యాబినె ట్లోకి వస్తారని ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ కొన్ని సినిమాల కమిట్మెంట్లు పూర్తి చేయాల్సి ఉంది. చాలా కాలంగా అవి పెండింగ్లో ఉన్నాయి. అప్పుడప్పుడు హాఫ్ డే కేటాయిస్తున్న షూటింగ్ పెద్దగా ముందుకు సాగటం లేదు. నాగబాబు మంత్రివర్గంలోకి వచ్చిన తర్వాత కాస్త రిలాక్స్ అయినా సరే పెండింగ్లో ఉన్న అన్ని సినిమాలు షూటింగు లు పూర్తి చేయాలని పవన్ కళ్యాణ్ పట్టుదలగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన వద్ద పలు కీలక శాఖలు ఉన్నాయి. పవన్ ఇటు సినిమా లు అటు రాజకీయా లు బ్యాలెన్స్ చేయాలి అంటే కాస్త కష్ట మే అవుతుంది. రెండు పడవల మీ ద కాళ్లు పెట్టి ప్రయాణం చేయడం అంత ఈజీ టాస్క్ అయితే కాదు.
పంచాయతీ రాజ్ ప్రధానమైన శాఖ అటవీ శాఖ కూడా కీలకం . పవన్ కళ్యాణ్ తన శాఖల విషయంలో పూర్తిగా అధికారుల మీదే బాధ్యతలు వదలకుండా మానిటరింగ్ చేసు కుంటున్నారు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు మూడు సినిమాలు పూర్తి చేయాలి. వీటిపై వందల కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఇప్పటికే చాలా రోజులు ఆలస్యం అవుతున్నాయి. ఇక వాటిని వెయిట్ చేయించకూడదని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అనుకుంటున్నారు. నాగబాబు ఎప్పుడైతే క్యాబినెట్ లోకి వస్తారో అప్పటినుంచి పవన్ సినిమా లు పూర్తి చేసి తిరిగి వచ్చేవరకు కూడా నాగబాబు దాదాపు ఉప ముఖ్యమంత్రి పదవి అనధికారికంగా ఎంజాయ్ చేస్తారనే చెప్పాలి.