తన ఫ్యాన్స్‌కు జనసేన పార్టీ చీఫ్‌, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చురకలు అంటించడం జరిగింది. నన్ను పని చేసుకోనివ్వండి అని అభిమానులను కోరారు జనసేన పార్టీ చీఫ్‌, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. నా మీద పడిపోతే నేను ఏ పనీ చేయలేనని పేర్కొన్నారు. నేను పని చేస్తేనే మీ భవిష్యత్తు బాగుంటుందన్న జనసేన పార్టీ చీఫ్‌, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్...సంచలన వ్యాఖ్యలు చేశారు.


ఓజీ.. ఓజీ.. అని అరిస్తే పనులు జరగవు అని చురకలు అంటించారు పవన్.  సినిమాల మోజులో పడి, హీరోలకు జేజేలు కొట్టి బాధ్యతలు మర్చిపోతున్నారని హితవు పలికారు.  నేను మీసం తిప్పితే, ఛాతీ కొట్టుకుంటే పనులు జరగవని అసహనం వ్యక్తం చేశారు జనసేన పార్టీ చీఫ్‌, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.  ప్రస్తుతం జనసేన పార్టీ చీఫ్‌, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.... మన్యం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ తరుణంలోనే.. అక్కడ ఉన్న గిరిజనుల సమస్యలపై ఫోకస్ పెట్టారు.


ఈ సందర్భంగా వారితో ఆడి, పాడారు. అనంతరం జనసేన పార్టీ చీఫ్‌, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.  ఎన్నికల్లో గిరిజన గ్రామాల అభివృద్ధికి ఇచ్చిన హామీలను ఖచ్చితంగా నెరవేరుస్తామని ప్రకటించారు. గడచిన ఐదేళ్ల పాలనలో ఈ ప్రాంతాల అభివృద్ధి గురించి పట్టించుకోలేదని ఆగ్రహించారు పవన్‌. రూ. 500 కోట్లు పెట్టి ఋషికొండ ప్యాలస్ కట్టారన్నారు. కానీ రూ. 9 కోట్లుతో ఈ రోడ్డు నిర్మించలేకపోయారని మండిపడ్డారు.

ఉత్తరాంధ్రను తాకట్టు పెట్టి తెచ్చిన వేలాది కోట్ల రూపాయలు ఏం చేశారో తెలియదని తెలిపారు. మద్యం అమ్మకాల ద్వారా వచ్చిన సుమారు 25 వేల కోట్ల రూపాయలు ఏమయ్యాయో తెలియదన్నారు పవన్‌ కళ్యాణ్‌.  2017 లో జనసేన పోరాట యాత్రలో ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు గిరిజనుల కష్టాలు చూశానని పవన్ వెల్లడించడం జరిగింది.  గిరిజనుల అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు, ప్రధాని మోడీ తో కలిసి పనిచేస్తానని ప్రకటించారు.


 


మరింత సమాచారం తెలుసుకోండి: