•అన్నకు అండగా పార్టీ ను గెలిపించింది
* ఒక్క దెబ్బతో కాంగ్రెస్ పగ్గాలు చేతపట్టింది..
ఆంధ్రప్రదేశ్ దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి , విజయమ్మ దంపతులకు పుట్టిన కుమార్తె షర్మిల.. మొదటి సంతానం ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కాగా ఈయన చెల్లెలే వై.ఎస్.షర్మిల.. అయితే షర్మిల రాజకీయ జీవితం ఎలా మొదలయ్యిందంటే.. 2012లో తన అన్న జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీను స్థాపించి..కొన్ని కారణాల వల్ల జైలు పాలవ్వడతో.. పార్టీ ను ముందుకు నడిపించడానికి తన తల్లి వైఎస్ విజయమ్మతో కలిసి వైసిపి పార్టీలోకి చేరి అక్కడి నుంచి ప్రచారం చేపట్టారు. అప్పటికి పై ఎన్నికలలో 18 అసెంబ్లీ స్థానాలలో 15 గెలిచాగా.. ఒకటి పార్లమెంట్ స్థానాలలో గెలిచారు. దీంతో వైసిపి పార్టీ కన్వీనర్ గా షర్మిల రాజకీయం మొదలు పెట్టింది.
ఇక 2019 ఏపీ ఎన్నికలలో అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు కి దీటుగా బై బై బాబు అనే డైలాగ్ తో బస్సు యాత్ర చేపట్టడంతో బాగా వైసిపి పార్టీకి క్రేజీ పెరిగింది.. దీంతో ఏకంగా షర్మిలాకి కూడా భారీ క్రేజ్ రావడంతో పాటుగా వైసీపీ పార్టీ 151 స్థానాలలో అసెంబ్లీ సీట్లలో భారీ విజయాన్ని అందుకున్నది. అయితే ఆ తర్వాత తన అన్నతో విభేదాలు రావడంతో తెలంగాణలో ఫిబ్రవరి 2021 లో కొత్త రాజకీయ పార్టీని తెలియజేసింది. అదే వైయస్సార్ తెలంగాణ పార్టీ అనే విధంగా మొదలుపెట్టింది షర్మిల..
కానీ 2023 షర్మిల తెలంగాణ శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీలోకి విలీనం చేసింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి తన వంతు కృషి చేసిన షర్మిల జనవరి4 వ తేదీన 2024లో వైయస్సార్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీని (YSRTP )కాంగ్రెస్ లోకి విలీనం చేయడంతో 2024 జనవరి 16న ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా ఎన్నికయింది షర్మిల. దీంతో అప్పటినుంచి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ నుంచి యాక్టివ్గా ఉంటూ వైసీపీ పార్టీని ఓడించడానికి చాలా కృషి చేసింది.. అలా ఒక్క దెబ్బతో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పగ్గాలను సైతం చేత పట్టుకుంది షర్మిల. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఏపీలో పెద్దగా పుంజుకోలేదని చెప్పవచ్చు.