- సిరిసిల్ల స్థితిగతిని మార్చిన నాయకుడు.
- అధికారం లేకున్నా ప్రజల వైపే నుంచే ప్రశ్నలు
- ఆ ఒక్క తప్పే ముంచేసిందా?
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ఆజ్యం పోసిన నాయకుల్లో కేటీఆర్ కూడా ఒకరు.. తండ్రి నడిచిన బాటలో నడుస్తూ ప్రజాసేవే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నారు..అధికార పక్షంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న ప్రజల వైపు నుంచి ప్రశ్నించడం కేటీఆర్ కున్న అలవాటు.. మాటతీరులో కానీ, పని విధానంలో కానీ తండ్రిని మించిన కొడుకుగా పేరు తెచ్చుకున్నారు. అలాంటి కేటీఆర్ గత రెండు పర్యాయాలు తెలంగాణ రాష్ట్రంలో అద్భుతమైన పాలన అందించి మంచి పేరు తెచ్చుకున్నారని చెప్పవచ్చు. ప్రస్తుతం హైదరాబాదులో ఐటి డెవలప్ మెంట్ అయింది అంటే అది కేటీఆర్ చలవే అని చెప్పవచ్చు..అమెరికాలో ఐటీ జాబ్ చేసిన కేటీఆర్ అదే అనుభవంతో ఎన్నో ఇంటర్నేషనల్ కంపెనీలను హైదరాబాద్ తెప్పించి లక్షలాది మంది యువతకు ఉద్యోగాలు వచ్చేలా చేశారు.