అయితే హీరో కారులో వచ్చి సినిమా చూసి వెళ్లిపోతే సరిపోతుంది..కానీ రోడ్డు షో చేసుకుంటూ వచ్చారని దీని కారణంగానే చాలామంది అభిమానులు వచ్చారని దీంతో రేవతి ఒకపక్క ఆమె కుమారుడు వెళ్లిపోయారు. వేలాది మంది రాక కారణంగా తొక్కిసలాట జరిగిందనీ.. తన కుమారుడిని పట్టుకొనే ప్రయత్నంలో రేవతి చనిపోయిందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ప్రస్తుతం రేవతి కొడుకు చావు బతుకుల మధ్య ఉన్నారు అంటు తెలియజేశారు.
ఇదంతా కూడా జరిగింది కేవలం హీరో సినిమా హాల్లో ఉండడం వల్లే అంటూ తెలిపారు. ఈ విషయాన్ని హీరోకి చేరివేయాలని పోలీసులు ప్రయత్నించిన థియేటర్ వాళ్ళు పోనీ ఇవ్వలేదని తెలిపారట. దీంతో ఏసీబీ ఫైర్ అవుతూ అందరిని లోపల వేస్తానని హెచ్చరించడంతో లోపల ఉన్న అల్లు అర్జున్ ని థియేటర్ నుంచి పంపించారని తెలిపారు.. ఒక బాలుడు గత నెల రోజులుగా ఆసుపత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఉంటే ఎవరైనా పరామర్శించారా?.. కానీ ఒక హీరోని ఒక పూట జైలుకు వెళ్లినందుకు.. కాళ్లు చేతులు పోయిన మనిషిలా చూడడానికి బారులు తీరి వెళుతున్నారు అంటూ.. అక్కడ ఏమైనా కాలుపోయిందా? కన్ను పోయిందా? అంటూ ఫైర్ అయ్యారు కానీ ఆసుపత్రిలో ఒక ప్రాణం పోయింది తప్పు చేసిన వారికి కచ్చితంగా శిక్ష పడాల్సిందే అంటు తెలిపారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.