ఏపీలో మహిళలకు ఉచిత బస్సు అమలు చేస్తామని ఎన్నికల సమయంలో కూటమి నేతలు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తరువాత ఈ పథకం అమలు దిశగా ఆర్టీసీ అధికారుల నుంచి నివేదిక కోరారు. తెలంగాణ, కర్ణాటకలో పర్యటించిన ఆర్టీసీ ఉన్నతాధికారులు అక్కడ అమలు అవుతున్న ఈ పథకం గురించి పూర్తి సమాచారం సేకరించారు. ఈ పథకం అమలు కారణంగా రాష్ట్ర ప్రభుత్వం పైన పడే ఆర్దిక భారం, లోటు భర్తీ, మహిళలకు అమలు చేయటం ద్వారా పురుష ల అభిప్రాయాలు అటో వాలా నుంచి వస్తున్న అభ్యంతరాల గురించి చర్చించారు. ఎన్నికల సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ప్రయాణం కల్పిస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చారు.ఈ క్రమంలో మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణ సేవలు ప్రారంభించేందుకు రంగం సిద్దం అవుతోందని టీడీపీ నేతలు చాలా రోజులుగా చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన ముఖ్యమైన హామీలలో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం కూడా ఒకటి. దీనిపై ప్రకటన ఎప్పడు వస్తుందా అని మహిళలు, యువతులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 

ఇటీవలే సీఎంగా నాలుగోసారి బాధ్యతలు తీసుకున్న చంద్రబాబు.. 5 ముఖ్యమైన హామీలైన మెగా డీఎస్సీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, సామాజిక పింఛన్ పెంపు.. నైపుణ్య గణన, అన్నా క్యాంటీన్ల పునరుద్ధణ మీద సంతకాలు చేశారు.ఈ క్రమంలో నేడు అనగా శనివారం మహిళలకు ఉచిత బస్సు పథకంపై కేబినెట్ సబ్‌ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముగ్గురు మంత్రులతో ఈ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. మహిళలకు ఉచిత బస్సు పథకం వివిధ రాష్ట్రాల్లో ఎలా అమలవుతుందో అధ్యయనం చేసేందుకు మంత్రుల బృందంతో కూడిన ఈ కమిటీ పథకం అమలు, విధివిధానాలు, ఏపీలో ఎలా అమలు చేయాలనే దానిపై మంత్రుల కమిటీ వీలైనంత త్వరగా తమ నివేదికల్ని, సూచనల్ని ప్రభుత్వానికి సమర్పించాలని ఉత్తర్వుల్లో ప్రస్తావించారు. ఆ నివేదిక ఆధారంగా ఆంధ్రప్రదేశ్‌కు అనువైన పథకాన్ని అమలు చేయనుంది. ఈ మేరకు ఓ సర్క్యులర్‌లో తెలిపింది. రవాణా, మహిళా-శివు సంక్షేమ, హోంశాఖ మంత్రులు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారని వివరించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: