వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలుగు రాష్ట్రాల్లో అందరికి పరిచయం అక్కరలేని పేరు. తండ్రి వారసత్వంతో ప్రత్యక్ష రాజకీయల్లోకి అడుగు పెట్టిన ఈ యువనేత.. తొలిసారి ఎంపీగా ఎన్నికై.. తండ్రి మరణం తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తనయుడిగా జగన్‌మోహన్‌రెడ్డి 2009 ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. కడప ఎంపీగా పోటీ చేసి లక్షా 78వేల ఓట్లతో భారీ మెజార్టీతో గెలిచారు. అదే ఎన్నికల్లో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రాగా రాజశేఖర్‌రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు.ఇదిలావుండగా జగన్ 2011లో 'యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ' ని స్థాపించారు. తన తండ్రి ఆశయాలు, సంక్షేమ పాలనను అందించడమే లక్ష్యమంటూ ప్రజల్లోకి వెళ్లారు. కొద్ది రోజులకే కాంగ్రెస్, టీడీపీల నుంచి ఎమ్మెల్యేలు వైసీపీలో చేరారు.జగన్‌కు అండగా నిలిచారు. విలువలకు ప్రాధాన్యమిస్తానంటూవారితో పదవులకు రాజీనామా చేయించారు. తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో జగన్ కడప ఎంపీగా పోటీ చేసి 5 లక్షల 43 వేల మెజార్టీతో ఘన విజయం సాధించారు.తర్వాత 2012లో ఆస్తుల కేసుల్లో జగన్‌ను సీబీఐ అరెస్ట్ చేయగా 16 నెలలు జైల్లో ఉన్నారు.జైలు నుంచి విడుదలైన తర్వాత జగన్ దూకుడు పెంచారు. ఏపీతో పాటూ తెలంగాణలో పార్టీని బలోపేతం చేశారు. 2014 ఎన్నికల్లో రెండు రాష్ట్రాల్లో పోటీచేశారు.తెలంగాణలో ముగ్గురు మాత్రమే విజయం సాధించారు. 

ఏపీలో టీడీపీ అధికారంలోకి రాగా వైసీపీ 67 సీట్లతో ప్రతిపక్ష హోదాను దక్కించుకుంది. జగన్ పులివెందుల నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసి గెలిచారు.  తర్వాత జగన్ 2017లో ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు పాదయాత్ర ప్రారంభించారు. నవ రత్నాలు ప్రకటించి ఇడుపుల పాయలో యాత్రను ప్రారంభించి ఇచ్చాపురం వరకు దాదాపు 3వేల కిలోమీటర్లకుపైగా కొనసాగించారు.ఈ క్రమంలో నే 2019 ఎన్నికల్లో రికార్డుస్థాయిలో విజయం సాధించిన జగన్‌కు.. 2024 ఎన్నికల్లో అదేస్థాయి చెత్త రికార్డుతో దారుణంగా ఓటమిపాలయ్యారు. 151 సీట్ల నుంచి కేవలం 11 సీట్లకే పరిమితమయ్యారు. దీంతో ముఖ్యమంత్రి నుంచి ప్రతిపక్ష నేతగా కూడా అర్హత సాధించలేకపోయారు.   వైసీపీ నుంచి సీనియర్ నాయకులు ఒక్కొక్కరు వెళ్లిపోతున్నా.. రాజకీయంగా జగన్ మళ్లీ యాక్టివ్ అవుతున్నారు. తన వ్యూహ రచనలకు పదునుపెడుతున్నారు.ఇదిలావుండగా గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కంటే భయకంరంగా ఉంటాదని అంటారు. తమ అధినేత కూడా రెండింతల ఉత్సాహంతో కచ్చితంగా పుంజుకుంటారు.." అంటూ ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.ఇదిలావుండగాఏపీ సీఎం జగన్ నేడు తన బర్త్ డే ను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పార్టీలకు అతీతంగా రాజకీయ ప్రముఖులు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ జగన్ కు బర్త్ డే గ్రీటింగ్స్ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: