అల్లు అర్జున్ ను టార్గెట్ చేసి మరి కామెంట్స్ చేశారు. రేవతి కొడుకు ఆసుపత్రి పాలైతే ఎవరూ అతన్ని పరామర్శించలేదని... కానీ అల్లు అర్జున్ ఒక్కరోజు అరెస్ట్ అయితే... సినిమా హీరోలు అలాగే సెలబ్రిటీలు అందరూ ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారని ఫైర్ అయ్యారు. ఒక విధంగా చెప్పాలంటే టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖుల అందరికీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
అయితే... తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకున్న తర్వాత... టాలీవుడ్ ఇండస్ట్రీని బాగా టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. మొట్టమొదటగా హైడ్రా పేరుతో... అక్కినేని నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ ను అన్యాయంగా కూల్చివేశారు. అక్రమంగా కట్టిన గోడను కూల్చకుండా ఆ మొత్తం కన్వెన్షన్ ను కూల్ చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఇక ఆ సమస్య ముగిసిన నేపథ్యంలోనే సమంతాను గెలికింది తెలంగాణ సర్కార్.
కేటీఆర్ అలాగే సమంతకు ఏదో సంబంధం ఉన్నట్లు కొండా సురేఖ... మాట్లాడటంతో... మళ్లీ టాలీవుడ్ ఇండస్ట్రీ ఏకమైంది. ఇక సమస్య ముగిసిన నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి.. అరెస్ట్ అంశం తెరపైకి వచ్చింది. అతన్ని అరెస్టు చేయడంపై.... మరోసారి టాలీవుడ్ ఇండస్ట్రీ ఏకమైంది. అయితే దీన్ని అసెంబ్లీ వేదికగా నిలదీశారు రేవంత్ రెడ్డి. దీంతో నెక్స్ట్ మరొక హీరోను కూడా రేవంత్ రెడ్డి టార్గెట్ చేయబోతున్నట్లు... సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మరి నెక్స్ట్ ఆ హీరో ఎవరు అనేది చూడాలి.