అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ప్రజల మధ్యకు వెళ్లి పలు విషయాలను తెలుసుకోవడమే కాకుండా సీతారామరాజు జిల్లాలో ఉన్నటువంటి అనంతగిరి మండలంలో ఉండేటువంటి గిరిజన గ్రామాలలో కూడా పర్యటించడం జరిగింది.. అయితే అక్కడ పవన్ కళ్యాణ్ కి ప్రకృతి చాలా ఆహ్లాదకరంగా కనిపించడంతో ఒక కీలకమైన ప్రకటన తెలియజేశారు. అదేమిటంటే తెలుగు సినీ పరిశ్రమ ఆంధ్ర ప్రదేశ్ కి తరలి రావాలని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా అందమైన ప్రదేశాలు ఉన్నాయి ఇక్కడ సినీ పరిశ్రమకు కూడా వాతావరణం చాలా అనుకూలంగా ఉంటుంది అంటూ తెలిపారు.
పవన్ కళ్యాణ్ నోటా ఇలాంటి మాట రావడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. మరి కొంతమంది గతంలో వైసిపి హయాంలో కూడా ఇలాంటి కండిషన్ పెడితే చాలా మంది విమర్శించారు.. ఆంధ్రప్రదేశ్లో షూటింగ్ తీస్తేనే రేట్లు పెంచుతాం లేకపోతే లేదు అన్నట్లుగా తెలియజేయడంతో చాలామంది విమర్శించారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం సినీ పరిశ్రమను ఆంధ్రప్రదేశ్కి తరలి రావాలి అంటూ తెలుపడంతో వైసిపి హయాంలో చేసిన పని ఇదే కదా అంటూ కామెంట్ చేస్తున్నారు నేటిజన్స్.. తెలుగు సినీ పరిశ్రమ కూడా విశాఖకు కలి వస్తుందని గత కొన్నేళ్లుగా ప్రచారం ముందే ఇప్పటివరకు అక్కడ ఎలాంటి స్టూడియోలు కూడా నిర్మించలేదు అంటూ ప్రజలు కూడా ప్రశ్నిస్తున్నారు. సినీ గ్లామర్ లేకపోతే ఎక్కడా కూడా అభివృద్ధి జరగదు, పరిశ్రమలు రావు, పర్యటన పెరగదు అంటూ యూత్ కూడా తెలియజేస్తున్నారు..