ఆంధ్రప్రదేశ్ లో 2024 ఎన్నికల సమయంలో కూటమిలో నుంచి సూపర్ సిక్స్ హామీలను ప్రకటించడం జరిగింది. ఈ హామీలలో మహిళలకు ఉచిత బస్సు విధానం పథకాన్ని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమలు చేస్తామంటూ తెలియజేశారు చంద్రబాబు,పవన్ కళ్యాణ్.. అయితే ఇప్పటికీ కూటమి ప్రభుత్వం వచ్చి 7 నెలలు అయినా ఈ పథకం గురించి ఎక్కడ మాట్లాడకపోవడంతో విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. దీంతో ఇటీవలే కూటమి ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకోగా వీటిపైన  ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అయిన షర్మిల సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది.



ఏపీలో కూటమి పార్టీ ఉచిత బస్సు ప్రయాణం పైన తీవ్ర చర్చ నడుస్తున్న సమయంలో ఇప్పటికీ ఈ పథకం పైన ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో మహిళలు కూడా కాస్త నిరుత్సాహ పడుతున్నారు.. ఈ పథకం పైన అమలుపై మంత్రులతో కూడిన బృందం కూడా ఇటీవలే ఏపీ ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ పథకం కర్ణాటక ,తెలంగాణ వంటి ప్రాంతాలలో అమలవుతోంది.. ఈ నివేదిక ఆధారంగానే ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ పథకాన్ని అమలు చేయాలని చూస్తున్నారట.


ఈ కమిటీలో హోం మంత్రులు, రవాణా ,మహిళా శిశు సంక్షేమ శాఖలతో పాటు మరికొంతమంది మాట్లాడడం జరిగింది. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. ఏపీలో త్వరలో ఉచిత బస్సు సర్వీసు ప్రారంభిస్తున్నామని తెలియజేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే షర్మిల ఈ విషయంపై స్పందిస్తూ.. మహిళలకు ఉచిత బస్సు పథకంపై టిడిపి, జనసేన, బిజెపి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు అంటూ మాట్లాడడమే కాకుండా.. కేవలం కాలయాపన తప్ప ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే పరిస్థితి ఎక్కడ కనిపించడం లేదని అధికారంలోకి వచ్చి ఇప్పటికీ ఆరు నెలలు అవుతూ ఉన్న సమయాన్ని వృధా చేస్తున్నారు అంటూ ఫైర్ అయ్యింది. కాంగ్రెస్ పార్టీ నుంచి చంద్రబాబును ఈ ప్రశ్నలు అడుగుతున్నామంటు షర్మిల తెలియజేసింది.చిన్న పథకానికి కూడా కొండంత కసరత్తు దేనికి అంటూ నిలదీసింది షర్మిల. తెలంగాణ , కర్ణాటక  వంటి ప్రాంతాలలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన వారంలోని ఈ పథకాన్ని చేసి చూపించామంటూ తెలిపారు. ఏపీలో కనీసం 300 కోట్లు వీటికి ఖర్చు అవుతుంది అది కూడా మీ దగ్గర నిధులు లేవా అంటే సీఎం చంద్రబాబును ప్రశ్నించింది..ప్రస్తుతం షర్మిల చేసిన ట్విట్ కూడా వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: