అయితే ఈ విషయం పైన తాజాగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు బిజెపి ఎంపీ పురందేశ్వరి స్పందిస్తూ పుష్ప 2 సినిమా తొక్కిసలాటలో సినీ హీరో అల్లు అర్జున్ కేవలం థియేటర్ వద్దకు ఒక నటుడుగా మాత్రమే వెళ్లారని మిగతా వారిని అరెస్టు చేయకుండా అల్లు అర్జున్ మాత్రమే అరెస్టు చేయడం కరెక్ట్ కాదంటూ ఆమె తెలియజేసింది. ఆ తర్వాత జమిలి ఎన్నికల పైన మాట్లాడుతూ.. జమిలి ఎన్నికలకు సంబంధించి లోక్సభలో ప్రవేశపెట్టిన బిల్లును సైతం జాయింట్ పార్లమెంటు కమిటీ ముందుకి తీసుకువెళ్లడం జరిగిందని తెలిపింది.
జమిలి ఎన్నికలు ఆనేవి ఒక పార్టీ ప్రవేశపెట్టినటువంటి అంశము కాదని దీనిపైన అన్ని పార్టీల ప్రజల అభిప్రాయాలు కూడా తీసుకుంటారని అలాగే వీటి వెనుక మంచి చెడు నిర్ణయాలు కూడా తీసుకుంటారని తెలిపింది. ఆ తర్వాత ఉభయసభలలో బిల్లును సైతం ప్రవేశపెట్టి చర్చ జరిపిన తర్వాత ఓటింగ్ జరుగుతుందని అంతేతప్ప ఇప్పటికి ఇప్పుడు ఏదో అయిపోతుందని ఎవరు గందరగోళం పడవద్దు అంటూ తెలిపింది బిజెపి ఎంపీ పురందేశ్వరి. ఓటింగ్ జరిగిన తర్వాత బిల్లు ఆమోదం పొందిన తర్వాతే జమిలి ఎన్నికలు వచ్చే అవకాశం ఉంటుంది అంటూ క్లారిటీ ఇవ్వడం జరిగింది పురందేశ్వరి