వైసీపీ ప్రభుత్వంలో టిడిపి నాయకులను కార్యకర్తలను ఆళ్ల నాని చాలా ఇబ్బందులకు గురి పెట్టారని అలాంటి వ్యక్తిని టిడిపి పార్టీలోకి చేర్చుకుంటే ఎలా అంటూ ఏలూరు టిడిపి ఎమ్మెల్యే రాధాకృష్ణ వ్యతిరేకిస్తూ ఉన్నారట. అయితే ఈ ఎమ్మెల్యేతో పాటుగా మరికొంతమంది టీడీపీ నేతలు ఆళ్ల నాని టిడిపిలోకి చేరితే పార్టీని వీడే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది.ఆళ్ళ నాని టిడిపిలోకి చేరితే కచ్చితంగా ఏలూరు మాజీ ఎమ్మెల్యే చైర్మన్ ఈశ్వరి, బలరాం కూడా టిడిపి పార్టీకి దూరం అవుతుందని ప్రచారం కూడా ఎక్కువగా వినిపిస్తోంది.
వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బలరాం, ఈశ్వరి దంపతుల సైతం వైసీపీ పార్టీలో చాలా కీలకంగా ఉన్నారు. వీరు చైర్ పర్సన్ గా కూడా పనిచేశారట. కానీ ఆ తర్వాత కంటిన్యూ చేయడానికి ఆళ్ళ నాని అడ్డుపడడంతో వైసిపి నుంచి టిడిపిలోకి చేరి గత ఎన్నికలలో ఆళ్ళ నాని ఓటమికి ఎంతో కృషి చేశారట.. అయితే ఇప్పుడు మళ్లీ అలాంటి నేతను తిరిగి పార్టీలోకి చేర్చుకోవడంతో ఈశ్వరి, బలరాం దంపతులు కాస్త అసహనాన్ని వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఒకవేళ ఆళ్ళ నాని టిడిపిలోకి చేర్చుకుంటే సహకరించమని ఈ దంపతుల పాటు చాలామంది నేతలు కూడా తెలుపుతున్నారు.. అంతేకాకుండా ఏలూరు జిల్లాలో వైసీపీ పార్టీ రాజకీయాలు చూసుకుంటున్నటువంటి కోటగిరి శ్రీధర్ తో కూడా ఈ దంపతులకు చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయట.. ఒకవేళ ఆళ్ళ నాని టిడిపిలోకి వస్తే విరు వైసీపీలోకి వెళ్లడానికి సిద్ధమయ్యారని విధంగా ఇప్పుడు చర్చ జరుగుతోందట. మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి.