మన ప్రజాస్వామ్యం లో విమర్శలు ప్రతి విమర్శలు , ఆరోపణలు చేసుకోవచ్చు కానీ భౌతిక దాడులకు దిగటం మాత్రం సమర్థించే విషయం కాదు .. అల్లు అర్జున్ ఇంటిపై కొందరు సంబంధం లేని వ్యక్తులు చేసిన దాడి కచ్చితంగా సహించరానిదే .. మరోసారి ఎవరు ఇలాంటి దాడులకు ప్రయత్నించకుండా వారికి బుద్ధి చెప్పాల్సి ఉంటుంది .. ఈ వివాదం మరింత ముదురుతున్న సమయంలో .. ఈయూ జేఏసీనో సంఘాల పేరుతోనే ఇంట్లోకి చొరబడటం అత్యంత దారుణమైన ఘటన.

 
అలాగే ఇది శాంతి భద్రతలకు సంబంధించిన విషయం కూడా .. ఒక ప్రైవేట్ పర్సన్ కు సంబంధించిన  ప్రాపర్టీ లోకి వెళ్లి ఆస్తి నష్టం చేయ‌టం .. బెదిరించడం చిన్న విషయం కాదు .. అల్లు అర్జున్ ఇంటి దగ్గర నానా రచ్చ చేసిన వారు ఇలాంటి పనుల్లో గొప్ప పేరు తెచ్చుకున్న వ్యక్తులుగా ఉన్నారు .. ఏ పార్టీ అధికారంలో ఉంటే  పార్టీతో సంబంధాలు పెట్టుకోవడం వీరికి వెన్నతో పెట్టిన విద్య .. ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్న ఫోటోలు అన్ని వెల్లడిస్తున్నాయి .. ఈ దాడులు వెనక ఇతర పెద్దలు ఉంటారో ఉండరో తెలియదు కానీ .. కుట్ర పూరితంగానే  ఈ దాడులు చేశారని అర్థమవుతుంది.


పోలీసులు ఈ విషయంలో కఠిన నిర్ణయాలు చర్యలు తీసుకుని స్పష్టమైన సందేశాన్ని ప్రజలకు ఇవ్వాల్సి ఉంటుంది .. ఇలా ఎవరి ఇంటి మీద కైనా వెళ్లి దాడులు చేస్తే కఠినమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుందని వారికి చూపించాలి .. లేకపోతే రేపు మరింత మంది ఇలాంటి పనులే చేస్తారు .. అప్పుడు పోలీసులకు కూడా ఎక్కువ సమస్యలు వస్తాయి .. ఈ ఘటనపై పోలీసులు ఎలా వ్యవహరిస్తారో .. ఇప్పటికే ఈ రాళ్ల దాడిపై అధికార ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూనే ఉన్నాయి .. అంటే ఈ క్రమంలో పోలీసులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి .

మరింత సమాచారం తెలుసుకోండి: