ఛత్తీస్‌గఢ్ హైకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు ఇప్పుడు తీవ్ర హాట్‌ టాపిక్ గా మారింది .  మృతదేహంతో శృంగారంలో పాల్గొన్నందుకు శిక్ష విధించే నిబంధన . భారత్ చట్టాల్లో లేదని ఆ నిందితుడిని నిర్దోషిగా ప్రకటిస్తూ సంచలన తీర్పు వెల్లడించింది ఛత్తీస్‌గఢ్ హైకోర్టు .  అదే క్రమంలో చనిపోయిన బాలికపై అత్యాచారం చేయటం అనేది అత్యంత భయంకరమైన చర్య అయినప్పటికీ పోక్సో గానీ , ఇతర చట్టాల్లో గాని సంబంధిత నిబంధన మృతదేహాలపై రేప్ చేయటం అనేది నేరంగా పరిగణించడం లేదని కోర్టు స్పష్టం చేసింది  ..


ఛత్తీస్‌గఢ్ గరియాబంద్ జిల్లాకు చెందిన తొమ్మిదేళ్ల బాలికను నితిన్ యాదవ్, నీలకంఠ గణేష్ అనే ఇద్దరు వ్యక్తులు కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేశారు .. ఆ తర్వాత ఆ బాలిక మృతదేహం పై నిందితులు అత్యాచారానికి పాలు పడ్డారు .. అయితే డు ఈ వ్యవహారంలో తాము దొరకకుండా అన్ని చర్యలు తీసుకున్నారు .. అయితే ఆ బాలిక కనిపించడం లేదని కుటుంబ సభ్యులు ఇచ్చిన పోలీస్ కంప్లైంట్ ఆధారంగా రంగంలోకి వచ్చిన పోలీసులు అసలు మిస్టీని చేదించారు .. ఇక పోలీస్ విచారణలో నితిన్ యాదవ్ , నీలకంఠ గణేష్ లే అత్యంత దారుణానికి ఒడిగట్టినట్లు తేలడంతో వారిద్దరిని అరెస్టు చేశారు .. ఈ కేసులో విచారణ జరిపిన ట్రయల్ కోర్టు హత్య ఇతర నేరాలకు పాల్పడిన నిందితుడు నితిన్ యాదవకు యావజ్జీవ  కారకార శిక్ష విధించింది.


ఇక ఈ దారుణమైన ఘటనలో సాక్షాలను నాశనం చేసినందుకు సహాయం నిందితుడిగా ఉన్న నీలకంఠ గణేష్ కు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ కేసులో ఆ బాలిక మరణించిన తర్వాత ఆమెపై నీలకంఠ గ‌ణేష్ రేప్ చేయగా ఈ కేసులో అతనికి కోర్టు శిక్ష వేయలేదు .. చనిపోయిన మృతదేహంపై అత్యాచారం చేసిన కేసులో నిందితుడిని నిర్దోషిగా ప్రకటించింది .. ఇక దీంతో ఇప్పుడు ట్రయల్ కోర్టు ఇచ్చిన ఈ తీర్పును ఆ బాధ్యత బాలిక తల్లి ఛత్తీస్‌గఢ్ హైకోర్టులో సవాల్ చేశారు . దీనిపై విచారణ జరిపిన చీఫ్ జస్టిస్ రమేష్ సిన్హా, జస్టిస్ బిభు దత్తా గురులతో కూడిన ద్విసభ్య ధర్మాసనం.. ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్ధించింది. ఈ క్రమంలోనే చనిపోయిన బాలిక తల్లి పిటిషన్‌ను తిరస్కరించిన హైకోర్టు బెంచ్.. భారతీయ చట్టంలోని శవంతో లైంగిక సంపర్కానికి శిక్ష విధించే నిబంధన లేదని పేర్కొంది. అయితే మృతదేహంపై అత్యాచారానికి ఒడిగట్టడం అనేది చాలా తీవ్రమైన విషయం అని కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: