కూటమి నేతలు కూటమిగా జతకట్టినప్పటి నుంచి ఏదో ఒక విషయంలో వీరి పేర్లు వైరంగా మారుతున్నాయి. ముఖ్యంగా గెలిచిన తర్వాత ఎవరికి వారు దిమాని తెలియజేస్తున్నారు. ఇప్పటికే చాలావరకు కూటమిలోని నేతల మనసులో మాటలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. ఇప్పుడు తాజాగా కర్నూలు జిల్లాలోని ఆదోని ఎమ్మెల్యే పార్థసారధి రెడ్డి కూడా పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. తన నియోజవర్గంలో తాను చెప్పినట్లుగానే పనులు జరగాలని తాను చెబితే కచ్చితంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం చెప్పినట్లే అంటూ ఆయన తెలియజేశారట.


2024 ఎన్నికలలో భాగంగా బిజెపి పార్టీ నుంచి పోటీ చేసి గెలిచిన పార్థసారథి వైసీపీ కార్యకర్తలకు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. గత ఐదు నెలలుగా మీకు సమయం ఇచ్చామని ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందుతున్న వైసిపి కార్యకర్తలు సైతం ఖాళీ చేసి ఆ పనులలో కూటమి కార్యకర్తలకు అప్పగించాలి అంటు హెచ్చరించారట. నిన్నటి రోజున ఆదోనిలో జరిగిన కూటమి పార్టీ కార్యకర్తల సమావేశంలో సైతం ఆదోని ఎమ్మెల్యే ఇలా మాట్లాడారట. మధ్యాహ్న భోజన పథకం తో పాటు రేషన్ షాపులు ,ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఇతరత్రా వాటిలలో వైసిపి కార్యకర్తలు పనిచేస్తున్నారని.. ఈ ఉద్యోగాల నుంచి స్వచ్ఛందంగా  వదిలేయాలని హెచ్చరించారట.


కొంతమంది కూటమి సహనాన్ని సైతం పరిశీలిస్తున్నారని.. తమను తొలగించమని లెటర్లు కూడా తీసుకురమ్మంటున్నారని తాను మాత్రం లెటర్లు ఇవ్వడం కుదరదని ఒకవేళ తాను చెప్పానంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగానే ఉంటుంది అంటు తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇలా ఎమ్మెల్యే ఈ విషయాన్ని ప్రకటించగానే కూటమి కార్యకర్తలు ఆదోని లోని ఐదు రేషన్ షాపులకు సైతం తాళాలు వేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఏ మేరకు రాబోయే రోజులలో ఈ విషయం పైన కూటమి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందొ చూడాలి. మొత్తానికి ఆదోని ఎమ్మెల్యే వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: